Advertisementt

బాబు జైల్లో ఉన్నారు, షూటింగ్స్ మానేశా: పవన్

Wed 18th Sep 2024 08:13 PM
chandrababu  బాబు జైల్లో ఉన్నారు, షూటింగ్స్ మానేశా: పవన్
Chandrababu is in jail, I have stopped shooting: Pawan బాబు జైల్లో ఉన్నారు, షూటింగ్స్ మానేశా: పవన్
Advertisement
Ads by CJ

చంద్రబాబు ను జగన్ ప్రభుత్వం స్కిల్స్ స్కామ్ లో జైలులో ఉంచినప్పుడు జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయిన ఆయన ఇప్పటివరకు తీరిక లేకుండానే కనబడుతున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్ళినపుడు క్రియాశీలకంగా మారిన పవన్ ఆ తర్వాత బాబు ని జైల్లో కలవడం, టీడీపీతో పొత్తు, చంద్రబాబు ని బీజేపీ కి దగ్గర చెయ్యడం ఇలా అన్నిటిలో కీలకంగా వ్యవహరించారు. 

చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు షూటింగ్స్ పక్కనపెట్టిన పవన్ మళ్ళీ ఇప్పటివరకు సెట్స్ లోకి వెళ్ళలేదు. తాజాగా ఆయన అదే కామెంట్స్ చేసాడు. బాబు గారి జైలులో ఉన్నప్పుడు షూటింగ్స్ చెయ్యలేదు, షూటింగ్‌కు రావాలని ప్రొడ్యూసర్లు అడిగినా నేను రాలేను అని చెప్పాను. తాజాగా ఆయన ఢిల్లీ NDA సమావేశంలో మట్లాడుతూ చంద్రబాబు కు రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన కళ్లలో ఎన్నడూ భయం కనిపించలేదు.

కలిసి కట్టుగా సమిష్టి కృషితో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో  విజయం సాధించాం. చంద్రబాబు తన లైఫ్ లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఆయనలోని ధైర్యాన్ని చూసాను, వరదల్లో ఆయన నడుస్తూ వెళ్ళి సమస్యలను పరిష్కరించారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ పవన్ మరోసారి చంద్రబాబు ని మెచ్చుకున్నారు. 

Chandrababu is in jail, I have stopped shooting: Pawan:

Happy to work with Chandrababu: Pawan Kalyan

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ