Advertisementt

రొమాంటిక్ గా భర్తకు నయన్ బర్త్ డే విషెస్

Wed 18th Sep 2024 07:28 PM
nayanthara  రొమాంటిక్ గా భర్తకు నయన్ బర్త్ డే విషెస్
Nayanthara birthday wishes for husband romantically రొమాంటిక్ గా భర్తకు నయన్ బర్త్ డే విషెస్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల ప్రేమను రిజిస్టర్ మ్యారేజ్ తోనూ, రెండేళ్ల క్రితం అతిరథులు మహారధుల నడుమ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న నయనతార-విగ్నేష్ శివన్ లు తమ లైఫ్ లో ప్రత్యేకమైన రోజులను అందమైన, అద్భుతమైన ప్రదేశాలలో గడుపుతుంటారు. 

తమ కవల కొడుకులు ఉలగ్, ఉయర్ లతో కలిసి విదేశాల్లో సందడి చేసే నయనతార-విగ్నేష్ శివన్ లు తాజాగా రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్న పిక్స్ వదిలారు. విగ్నేష్ శివన్ బర్త్ డే సందర్భంగా నయనతార భర్త కు క్యూట్ గా కాదు కాదు రొమాంటిక్ గా బర్త్ డే విషెస్ తెలియజేసింది. 

హ్యాపీ బర్త్ డే మై ఎవ్రిథింగ్, మాటల్లో చెప్పలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను, లైఫ్ కి నువ్వేం కావాలని కోరుకున్నావో అవన్నీ నీకు దక్కాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ భర్త తో కలిసి రొమాంటిక్ గా వున్న ఫొటోస్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెప్పింది నయన్. 

Nayanthara birthday wishes for husband romantically:

Nayanthara birthday wish for husband Vignesh Shivan is pure love

Tags:   NAYANTHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ