Advertisementt

దిగజారి పోతున్న హీరోల అభిమానులు

Wed 18th Sep 2024 11:34 AM
mega fans  దిగజారి పోతున్న హీరోల అభిమానులు
Fans of declining heroes దిగజారి పోతున్న హీరోల అభిమానులు
Advertisement
Ads by CJ

స్టార్ హీరోల అభిమానుల మధ్యన వైరం ఇప్పటిది కాకపోయినా.. మరీ ఇంత దారుణమైన పగ, ప్రతీకారాలు మాత్రం ఎన్నడూ కనిపించలేదు. ఇప్పుడు మాత్రం మెగా-ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్యన సోషల్ మీడియాలో జరిగే రచ్చ చూస్తే అభిమానులు ఎంతగా దిగజారిపోతున్నారో అనకమానరు. ఒక సినిమా పై ఎంతగా విషం చిమ్మాలో అంత చిమ్ముతున్నారు మెగా ఫ్యాన్స్. 

ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈనెల 27 న విడుదలవుతుంది. దేవర కు సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదు.. కానీ మెగా అభిమానులు పనిగట్టుకుని దేవర చిత్రాన్ని చంపేసేందుకు చేస్తున్న కుట్ర చూస్తే అస్సహ్యం వేస్తుంది. ఇది దేవర తోనే ఆగుతుందా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మెగా ఫ్యాన్స్ దొరకరా, గేమ్ చెంజర్ విడుదల సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ కోపాన్ని చూపిస్తే అప్పుడు పరిస్థితి. 

కనీసం ఆ జ్ఞానం కూడా లేకుండా మెగా ఫ్యాన్స్ రెచ్చిపోయి దేవర చిత్రాన్ని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చెయ్యడం చూస్తే మాత్రం నిజంగా మెగా అభిమానుల తిట్టకుండా ఉండలేరు. ఎన్టీఆర్-రామ్ చరణ్ మంచి ఫ్రెండ్స్, కానీ వారి అభిమానులు ఇంత నీచంగా దిగజారిపోవడమే అందరిని షాక్ కి గురి చేస్తుంది. మరి ఈ అభిమానుల పగ, రచ్చ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. 

Fans of declining heroes:

Mega fans vs NTR fans 

Tags:   MEGA FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ