Advertisementt

బిగ్ బాస్ కాదు బాబోయ్ చేపల మార్కెట్ ఇది!!

Wed 18th Sep 2024 10:01 AM
bigg boss 8  బిగ్ బాస్ కాదు బాబోయ్ చేపల మార్కెట్ ఇది!!
This is fish market not Bigg Boss!! బిగ్ బాస్ కాదు బాబోయ్ చేపల మార్కెట్ ఇది!!
Advertisement
Ads by CJ

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 మొదలై రెండు వారాలు పూర్తయ్యి మూడో వారం నడుస్తుంది. రెండు వారాల్లో ఇద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బెజవాడ బేబక్క, శేఖర్ భాషాలు ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారం నామినేషన్స్ విషయంలో హౌస్ మేట్స్ మద్య రచ్చ రచ్చ. 

నామినేషన్స్ అంటే ఓకె. నామినేషన్స్ విషయంలో యష్మి కి సోనియా కి, యష్మికి నాగ మణికంఠ కు మధ్యన పెద్ద గడవే జరిగింది. ఆ కోపం తర్వాత రోజు కూడా కంటిన్యూ అయ్యింది. ఇక మంగళవారం టాస్క్ విషయంలో నిఖిల్ vs అభయ్ మధ్యలో బెలూన్స్ గేమ్ లో సోనియా సంచాలక్. కానీ ఆ గేమ్ లో సంచాలక్ సోనియా నిఖిల్ ని విన్నర్ గా తేల్చడంతో గొడవ స్టార్ట్ అయ్యింది. 

అభయ్ ఎవరైనా ఓకె, ఇకపై నేను గేమ్ ఆడను, బిగ్ బాస్ తోనే మాట్లాడతాను, పంపిచ్చేస్తే వెళ్ళిపోతాను అన్నాడు. కానీ యష్మి సోనియా నువ్వు సంచాలక్ గా ఫెయిల్ అయ్యావ్, నువ్వు బెలూన్స్ ని లోపల వెయ్యలేదు, మేము చెప్పాక వేశావు, నువ్వు ఆటలోనే కాదు, సంచాలక్ గాను బుద్ధి చూపించావ్ అంటూ రచ్చ రచ్చ చేసింది. హౌస్ మొత్తం గోల గోల, అది చూస్తే చేపల మార్కెట్ బెటర్ అంటారేమో. 

నిన్నటి ఎపిసోడ్ చూసిన బుల్లితెర ప్రేక్షకులు ఇది బిగ్ బాస్ హౌస్ కాదురా బాబోయ్ చేపల మార్కెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

This is fish market not Bigg Boss!!:

Bigg Boss 8 update

Tags:   BIGG BOSS 8
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ