Advertisementt

ఎన్టీఆర్ ప్లానింగ్ మాములుగా లేదు

Tue 17th Sep 2024 07:25 PM
devara  ఎన్టీఆర్ ప్లానింగ్ మాములుగా లేదు
NTR Heads To Chennai For Devara Promotions ఎన్టీఆర్ ప్లానింగ్ మాములుగా లేదు
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెన్నై లో దిగాడు. గత వారం రోజులుగా దేవర ప్రమోషన్స్ కోసం ముంబై లో హడావిడి చేసిన యంగ్ టైగర్ ఇపుడు చెన్నై కి దేవర ప్రమోషన్స్ కోసం వెళ్ళాడు. అక్కడ దేవర ఆడియో లాంచ్ వేడుకని రేపు బుధవారం నిర్వహించబోతున్నారు. ఈరోజు మంగళవారం సాయంత్రం కోలీవుడ్ మీడియా తో ముచ్చట్లు పెట్టాడు. 

అక్కడి నుంచి అటే ఎన్టీఆర్ ఇతర సిటీస్ ప్రమోషన్స్ అంటే బెంగుళూరు, కొచ్చి లో దేవర ప్రమోషన్స్ ప్లాన్ చెయ్యగా.. ఇక్కడ హైదరాబాద్ లో దేవర ప్రమోషన్స్ పై అందరిలో క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఈ నెల 22 న హైదరాబాద్ లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సోలో ఇంటర్వూస్, మీడియా మీట్ విషయంలో ఇంకా సస్పెన్స్ నడుస్తుంది. 

అదలావుంటే ఎన్టీఆర్ దేవర హైదరాబాద్ ప్రమోషన్స్ ముగించేసి యుఎస్ కి వెళ్ళబోతున్నాడట, అక్కడ యుఎస్ లో దేవర స్పెషల్ ప్రీమియర్ లో ఎన్టీఆర్ సందడి చెయ్యబోతున్నాడు. 23 న అమెరికా వెళ్లి స్పెషల్ ప్రీమియర్ లో పాల్గొన్న ఎన్టీఆర్ మళ్ళీ దేవర విడుదల తేదీ సెప్టెంబర్ 27 కల్లా ఆయన హైదరాబాద్ కి వచ్చేస్తాడని తెలుస్తుంది. 

NTR Heads To Chennai For Devara Promotions:

Devara: NTR heads to Chennai

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ