Advertisementt

బిగ్ బాస్ సోహెల్ ఇంట్లో తీవ్ర విషాదం

Tue 17th Sep 2024 06:15 PM
sohel  బిగ్ బాస్ సోహెల్ ఇంట్లో తీవ్ర విషాదం
Bigg Boss fame Sohel mother passes away బిగ్ బాస్ సోహెల్ ఇంట్లో తీవ్ర విషాదం
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఒకటి రెండు సినిమాల్లో సైడ్ కేరెక్టర్స్ చేసినా పెద్దగా ఫేమస్ అవ్వని సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ కి వెళ్ళాక హౌస్ లో నరాలు పొంగేలాంటి ఎనెర్జీతో రెచ్చిపోయి మటన్ , మటన్-చికెన్, చికెన్ అంటూ హౌస్ లో చేసిన రచ్చతో ఆడియన్స్ కు బాగా రిజిస్టర్ అయ్యాడు. టాప్ 3 లో ఉండి 15 లక్షలు పట్టుకుపోయిన సోహెల్ ఆ తర్వాత హీరో అయ్యాడు. 

హీరోగా వరస సినిమాలు చేసిన సయ్యద్ సోహెల్  ప్రస్తతం సైలెంట్ గా కనిపిస్తున్నాడు. తాజాగా సయ్యద్ సోహెల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోహెల్ మదర్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సయ్యద్ సోహెల్ సొంతూరు కరీంనగర్, సోహెల్ కి ఓ తమ్ముడు. 

సోహెల్ తల్లి కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను హైరాబాద్ లోని హైటెక్ సిటీ మెడికవర్ ఆసుపత్రిలో జాయిన్ చెయ్యగా ఆమె పరిస్థితి చేదాటిపోయి మరణించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సోహెల్ తల్లి మృతదేహాన్ని కరీం నగర్ కి తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. 

Bigg Boss fame Sohel mother passes away:

Bigg Boss fame Sohel suffers a personal loss

Tags:   SOHEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ