Advertisementt

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ ఎటాక్

Tue 17th Sep 2024 05:09 PM
poonam kaur  త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ ఎటాక్
Poonam Kaur direct attack on Trivikram త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ ఎటాక్
Advertisement
Ads by CJ

కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికగా గురూజీ త్రివిక్రమ్ పై ఇండైరెక్ట్ ట్వీట్లు వేస్తున్న నటి పూనమ్ కౌర్.. ఆయన వలన పవన్ కళ్యాణ్ వలన తనకు అన్యాయం జరిగినట్లుగా ట్వీట్ల రూపం లో ఎటాక్ చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ డైరెక్ట్ ఎటాక్ కి దిగింది. జల్సా సినిమా సమయంలో తనకి ఆఫర్ ఇస్తాను అని చెప్పి మోసం చెయ్యడమే కాదు, పవన్ వలన త్రివిక్రమ్ వలన ఇండస్ట్రీకి దూరమైనట్లుగా చెప్పుకొచ్చింది. 

ఈరోజు మంగళవారం జానీ మాస్టర్ ఇష్యులో సోషల్ మీడియా వేదికగా స్పందించింది. అసలు జానీ ని మాస్టర్ అనే అర్హత అతనికి లేదు.. మాస్టర్ అంటే ఎంతో విలువైన పదం.. ఎంతో ఉన్నతమైన పదం, ఒకవేళ జానీ ని జానీ మాస్టర్ అని పిలిస్తే ఆ పదం పరువు పోతుంది అంటూ ట్వీట్ చేసింది. 

మరి కాసేపటికే పూనమ్ కౌర్ మరో బాంబ్ పేల్చింది. త్రివిక్రమ్ మీద ఆల్రెడీ మా లో ఫిర్యాదు చేశానని, అయినా వారు త్రివిక్రమ్ పై కంప్లైంట్ తీసుకోవడం లేదని, త్రివిక్రమ్ వలన తాను ఎంతో ఇబ్బందులు పడ్డానని, పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఒత్తిళ్లు కూడా అనుభవించానని, త్రివిక్రమ్ విషయం మీద ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలి అంటూ పూనమ్ కౌర్ వేసిన ట్వీట్ వేసింది ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. 

Poonam Kaur direct attack on Trivikram:

Poonam Kaur demands action against director Trivikram

Tags:   POONAM KAUR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ