Advertisementt

గేమ్ ఛేంజర్ పై మళ్ళీ మొదలైన అనుమానాలు

Tue 17th Sep 2024 03:42 PM
game changer  గేమ్ ఛేంజర్ పై మళ్ళీ మొదలైన అనుమానాలు
Rekindled Doubts on Game Changer గేమ్ ఛేంజర్ పై మళ్ళీ మొదలైన అనుమానాలు
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-శంకర్ కాంబో లో మూడేళ్ళ క్రితమే మొదలైన గేమ్ ఛేంజర్ చిత్రం విడుదల విషయములో జరుగుతున్న జాప్యానికి మెగా ఫ్యాన్స్ లో కోపం నషాలానుకంటుతుంది. శంకర్ గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. ఎంతగా అంటే గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఇచ్చేందుకు కూడా సమయం లేనంత. 

డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్ విడుదల అనే పీలర్స్ వదలడమే కాదు.. ఇకపై గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ వస్తూనే ఉంటాయని ఊరించి నెలలు గడిపోతున్నాయి. గేమ్ ఛేంజర్ సెకండ్ సాంగ్ అంటూ చెప్పినా, ఆ డేట్ ఇవ్వలేదు. దానితో మెగా ఫ్యాన్స్ కు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది. 

ఇప్పుడు డిసెంబర్ 20 న గేమ్ ఛేంజర్ విడుదల ఉండకపోవచ్చు, అందుకే విడుదల తేదీ ఇవ్వకుండా మేకర్స్ తాత్సారం చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇండియన్ 2 మిస్టేక్ రిపీట్ అవ్వకూడదని శంకర్ కష్టపడుతున్నారు. డిసెంబర్ లో సినిమా విడుదల అయ్యే ఛాన్స్ లేదు.  

మార్చ్ లో గేమ్ చెంజర్ విడుదల ఉండొచ్చు, ఆ విషయం త్వరలోనే ప్రకటిస్తారంటూ మరొకసారి అనుమానాలు రేకెత్తేలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరి గేమ్ ఛేంజర్ మేకర్స్ ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.  

Rekindled Doubts on Game Changer:

Game Changer update 

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ