వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఖరిలో మార్పొచ్చింది. వైసీపీ పార్టీకి భజన చేసే బ్లూ మీడియా జగన్ లో ఆ మార్పుని గుర్తించి చాటి చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. గత ఐదేళ్ళలో జగన్ చేసే తప్పులను కప్పి పుచ్చిన బ్లూ మీడియా ఇప్పుడు అధికారం పోగానే జగన్ చేసే, చేస్తున్న తప్పులని చూపిస్తుంది. ఇక జగన్ లో ఇప్పుడు సడన్ గా ఏ విషయంలో మార్పొచ్చిందో కూడా బ్లూ మీడియా స్పష్టంగా చెబుతుంది.
పవన్ కళ్యాణ్ ని జగన్ పర్సనల్ గా టార్గెట్ చెయ్యడం వలనే కాపు వర్గం వైసిపి కి దూరమైంది. పవన్ ను అనవసరంగా రెచ్చగొట్టి చంద్రబాబు తో పొత్తుపెట్టుకునేలా చేసింది జగనే. 2014 లో పొత్తుతో గెలిచిన చంద్రబాబు, పవన్ లు, 2019 లో విడివిడిగా పోటీ చేసి జగన్ కు అధికారం కట్టబెట్టారు. జగన్ తన సమర్ధతతో 2019 లో వైసీపీ పార్టీకి అంత మెజారిటీ రాలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడిపోయి పోటీ చెయ్యడం వలనే జగన్ గెలిచాడు.
సరే గెలిచాక అయినా పవన్ కళ్యాణ్ ను దత్త పుత్రుడు, నాలుగు పెళ్లిళ్లు అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసాడు. దానితో పవన్ చంద్రబాబు తో పొత్తుపెట్టుకుని జగన్ ను అధికారంలోకి దించేవరకు నిద్రపోలేదు. కాపు సామజిక వర్గం కూడా జగన్ కు దూరమయ్యాక తత్త్వం బోధపడింది. పవన్ ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యడు, తన జోలికి వస్తే వదలడు.
ఇప్పుడు జగన్ పవన్ పట్ల తన వైఖరి మార్చుకున్నాడు. పిఠాపురం వెళ్ళినప్పుడు సినిమా ఆర్టిస్ట్ అని పవన్ ని చూసి జాలిపడిన జగన్ పవన్ ను ఇంక ఒక్కమాట కూడా అనలేదు, పవన్ కళ్యాణ్ తో మనకెందుకులే అని జగన్ సైలెంట్ అయ్యాడు. మరి పవన్ విషయంలో జగన్ మారాడు, జగన్ పట్ల పవన్ వైఖరి ఎలా ఉండబోతుందో చూద్దామంటూ బ్లూ మీడియా కథనాలు రాసుకుంటుంది.