ప్రముఖ కొరియాగ్రాఫర్, జనసేన నేత జానీ మాస్టర్ పై అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ లైంగిక వేధింపులు కేసు పెట్టిన విషయం హాట్ టాపిక్ అయ్యింది. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేయబోయాడు, నా ఫ్లాట్ కి వచ్చి పలుమార్లు లొంగ తీసుకోవడానికి ట్రై చేసాడు, కారా వ్యాన్ లో నాపై అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ లేడీ కొరియాగ్రాఫర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చెయ్యడం కలకలం సృష్టించింది.
జానీ మాస్టర్ పై అభియోగాలు రావడం, కేసు నమోదు కావడంతో జనసేన పార్టీ జానీ మాస్టర్ ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమంటూ వేటు వేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ ఎవరికీ అందుబాటులో లేడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడంటూ ప్రచారం మొదలయ్యింది.
ఈనేపథ్యంలో నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. జానీ మాస్టర్ ని ఇకపై మాస్టర్ అని సంబోదించవద్దు, మాస్టర్ అనే పేరుకు ఉన్న గౌరవం పోతుంది. మాస్టర్ అనే పదానికి ఏంతో గౌరవం ఉంది, అతన్ని మాస్టర్ అని పిలిస్తే ఆ పేరుకు ఉన్న విలువ పోతుంది అంటూ పూనమ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.