టాలీవుడ్ కి ఉప్పెన చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. దానితో కృతి శెట్టి అదృష్టానికి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ దెబ్బకి వరస ఆఫర్స్. దానితో ఉక్కిరిబిక్కిరి అయ్యిందో.. అనుభవం చాలలేదో.. పాత్రలు అంచనా వెయ్యడంలో తడబడి వరసగా నిరాశపరిచే సినిమాలను చేసి చేతులు కాల్చుకుంది.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేసినా ప్రయోజనం లేకపోయింది. తెలుగులో ఆమెకి మళ్ళీ సక్సెస్ రాలేదు, అటు తమిళ, మళయాళంలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతి శెట్టికి మలయాళ ఇండస్ట్రీ కూడా నిరాశపరిచే సినిమా ఇచ్చింది.
తన 50 వ సినిమా ARM లోకి టోవినో థామస్ కృతి శెట్టి కి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. గత గురువారం విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. హీరోయిన్ కృతి శెట్టి ముచ్చట ఎక్కడా కనిపించలేదు. దానితో మలయాళంలోనూ కృతి శెట్టి కి షాక్ తప్పలేదు. మళయాలంలో ARM కి డీసెంట్ టాక్ ఉంది కానీ కలెక్షన్స్ పరంగా అంతగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.
పాన్ ఇండియా మూవీగా విడుదలైన ARM గనక తెలుగులో హిట్ అయితే కృతి శెట్టి కెరీర్ మళ్ళీ పుంజుకునేది. కానీ ఇప్పడు మాత్రం ఆ ఆశ తీరేలా లేదు. ఇక తమిళనాట ప్రదీప్ రంగనాధన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లోను.. కార్తీతో వా వాతియర్, జయం రవి జీనీ చిత్రాలలో నటిస్తుంది. అవేమన్నా వర్కౌట్ అయితే తప్ప అమ్మడుకు మంచి రోజులు రావు.