RGV హీరోయిన్ సోనియా బిగ్ బాస్ 8 లో చేసే అతి చూసి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియా ఏదో సరదాగా అడిగిన ప్రశ్నకు అడల్టరి జోక్స్ అంటూ పెద్ద పెద్ద వార్డ్స్ యూస్ చేసి రచ్చ చెయ్యడమే కాదు.. నువ్వు తడి బట్టలు వేసుకుంటున్నప్పుడు హౌస్ మేట్స్ అన్ కంఫర్టుబుల్ గా ఫీలవుతున్నారంటూ పదే పదే విష్ణు ప్రియను టార్గెట్ చేసింది.
నువ్వు ఎలా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమి అనరేమో నా పేరెంట్స్ నన్ను వాచ్ చేస్తున్నారు, ఇతరులు ఏమనుకుంటారో అంటూ విష్ణు ప్రియను అనే సోనియా నిఖిల్, పృథ్వీ లతో చేసే ఫ్రెండ్ షిప్ అయినా, మరేదైనా ఆడియన్స్ చూస్తున్నారు. వాళ్లతో సోనియా బిహేవియర్ ఎలా ఉంది, విష్ణు ప్రియను అంతగా టార్గెట్ చేసే సోనియా ఇద్దరు అబ్బాయిలతో అలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజెన్స్ మాట్లాడడమే కాదు నాగార్జున పర్టిక్యులర్ గా సోనియా ని నించో బెట్టి ఎడా పెడా ఇచ్చేసారు.
బయట సోనియా పై పెరుగుతన్న నెగిటివిటీపై నాగార్జున ఇండైరెక్ట్ గా సోనియా ని వార్న్ చేసారు. ఈ వారం నామినేషన్స్ లో సోనియా యష్మి ని నామినేట్ చెయ్యడంతో మొదలైన గొడవ నిఖిల్-పృథ్వీ తో నువ్వు చేస్తున్నదేమిటి, నిఖిల్ పై, పృథ్వీ పై, అభయ్ పై పెట్టిన ఇంట్రెస్ట్ మీరు క్లాన్ పై, గేమ్ పై పెట్టలేదు అంటూ యష్మి అడిగిన ప్రశ్నకు నిజంగా సోనియా బిత్తర పోయింది. నువ్వు క్లాన్ లో గేమ్ మీద దృష్టి పెట్టలేదు అంటూ సోనియా ను ఏసుకుంది యష్మి.