రాజమౌళి - మహేష్ కాంబో మూవీ కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సెట్స్ మీదకి వెళ్తాడా అని ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో కాచుకుని కూర్చున్నారు. రాజమౌళి ఆ ముహూర్తం ఎప్పుడు పెడతారా అని సినిమా ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది.
ఈ నెలలోనే రాజమౌళి-మహెష్ కాంబో మూవీ కాన్సెప్ట్ వీడియోతో ఎనౌన్సమెంట్ రాబోతుంది అనే ప్రచారం జరిగినా రాజమౌళి మాత్రం తాను అనుకున్న ప్రీ ప్రొడక్షన్ అవుట్ ఫుట్ వచ్చేవరకు సినిమాని హడావిడిగా లాంచ్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అసలు SSRMB ప్రాజెక్ట్ అప్ డేట్స్ పై ఎలాంటి లీకులు రాకూండా రాజమౌళి కాంపౌండ్ కాపాడుతుంది.
అయితే దసరా కు రాజమౌళి-మహేష్ కాంబో మూవీకి మూర్తం పెట్టినట్లుగా టాక్ వినిపిస్తుంది. స్టార్ హీరోలు, అతిరథమహారధుల నడుమ SSRMB ని గ్రాండ్ గా లాంచ్ చేసే ఏర్పాట్లలో రాజమౌళి ఉన్నాడట. దసరా కు SSRMB ని అఫీషియల్ గా మొదలు పెట్టి ఈ ఏడాది చివరిలో అయినా.. లేదంటే వచ్చే ఏడాది జనవరిలో అయినా సినిమాని రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.