సిద్దార్థ్-అదితి రావు లు తమ డేటింగ్ ని ఎంత సీక్రెట్ గా దాచేసారో.. తమ నిశ్సితార్ధాన్ని కూడా అంతే గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణలోని వనపర్తిలో తమ పూర్వీకుల గుడిలో సంప్రదాయబద్ధంగా చేసుకుని ఆ తర్వాత మీడియాకు తమ ఎంగేజ్మెంట్ విషయాన్ని రివీల్ చేసారు.
మార్చ్ 27 న ఇరు కుటుంబాల నడుమ గుట్టుచప్పుడు కాకుండా 400 ఏళ్ళనాటి వనపర్తి టెంపుల్ లో నిశ్చితార్ధం చేసుకున్న సిద్దార్థ్-అదితి రావు ల పెళ్లి వార్త ఎప్పుడు చెబుతారా అని వాళ్ళ అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. గత వారం ఐ ఫోన్ 16 లాంచ్ లో సందడి చేసిన ఈ జంట పెళ్లి విషయంలో అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.
కట్ చేస్తే సిద్దార్థ్-అదితి ల పెళ్లి అంగరంగ వైభవముగా జరిగిపోయింది. నిశ్చితార్ధం జరిగిన వనపర్తిలోని 400 ఏళ్ల నాటి ఆలయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో జరిగినట్లుగా తెలుస్తుంది. ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.
తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది సిద్ధార్థ్, అదితి జంట. ప్రస్తుతం సిద్దు-అదితిల పెళ్లి ఫొటోస్ నెట్టింట్లో సంచలనంగా మారాయి.