దేవర చిత్రం విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో కొంతమంది పనిగట్టుకుని దేవరపై విషం చిమ్ముతూ ట్రోల్ చెయ్యడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చిరాకు పెడుతుంది. దేవర ప్లాప్ అవ్వాలని కోరుకుంటున్న వారికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్లు ఇస్తున్నారు. తాజగా ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక్కరు.. సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ చూస్తే వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనుకోవాల్సిందే.
ఇప్పుడు మన #Devara మీద జరుగుతున్నది నెగిటివిటీ ఏ కాదు.
అసలు సిసలు నెగిటివిటీ సినిమా రిలీజ్ అయ్యాక బెనిఫిట్ షోల నుండే మొదలు పెట్టాలి అని ఓ పనికిమాలిన వర్గం రెడీగా ఉంది
ఎందుకు అంటే వాళ్ళ సంతలో ఉన్న పనికి రాని చేతకాని ఓ హీరో ని నిలబెట్టుకోడానికి..
చిన్న చిన్న మీమ్ పేజీల నుండి, యూట్యూబ్ ఛానెల్స్, బాలీవుడ్ పెయిడ్ మాఫియా దాక నార్త్ లో కూడా చాలా పేజ్ లను, హైర్ చేసుకుని రెడీ గా పెట్టుకుని ఉన్నారు
తెలుగు సినిమా చరిత్ర లో మునుపు ఎన్నడూ లేని విధం గా ట్రైలర్ నుండే ఓ సినిమాని టార్గెట్ చేస్తున్నారు ...
వాళ్ళ భయానికి ప్రధాన కారణాలు....
1) కొరటాల రిజనల్ డైరెక్టర్ ముందు తీసిన చిత్రం భారీ డిజాస్టర్, కానీ ఊహించని విధంగా ఈ సినిమా హైప్ ఆకాశాన్ని అంటుకుంది...
2) ఓవర్సీస్ బుకింగ్స్ మామూలుగా లేవు కానీ విని ఎరుగని రీతిలో దాదాపు 40,000 కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి ఇంకా సినిమా రిలీజ్ కి 13 రోజుల ముందు గానే అది కూడా
3) ఇక తెలుగు రాష్ట్రాలలో @tarak9999 అభిమానుల లోను జనరల్ ప్రేక్షకులకు ఈ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి
4) దీనికి తోడు ఓ మోస్తరు టాక్ వచ్చిన డే 1 మొదలు క్లోజింగ్ దాకా కలక్షన్స్ రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ
5) ముఖ్యంగా ఈ చిత్రం పాజిటివ్ టాక్ వస్తే ప్యాన్ ఇండియా స్థాయిలో ఎన్టీఆర్ పేరు మారుమోగిపోవడం తధ్యం
చివరిగా మన తారక్ అన్న అభిమానులకు చెప్పేది ఒక్కటే మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి ..
వాటికి సెప్టెంబర్ 27 వ తేదీన మన ఘన విజయమే గర్జనలా వినిపించి తోకలు ముడుచుకోవాలి ప్రతి ఒక్కడు జై ఎన్టీఆర్, జై దేవర అంటూ చేసిన ట్వీట్ చూసిన వారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీక్ కాదు చాలా స్ట్రాంగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.