జానీ మాస్టర్‌పై పవన్ సస్పెన్షన్ వేటు వేస్తారా..?
ఆంధ్రపదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార, విపక్ష పార్టీల్లో నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల రాసలీలలు.. లైంగిక వేధింపులకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువయ్యింది..! ఈ విషయాల్లో నాడు వైసీపీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఓటమికి గల కారణాల్లో ఒకటి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అందుకే ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవరిస్తున్నారు. ఆరోపణలు వస్తే చాలు ఎలాంటి చర్యలకు అయినా సిద్ధం అవుతున్నారు. ఇందుకు చక్కటి ఉదాహరణే ఇటీవల సత్యవేడులో జరిగిన పరిణామమే.
బాబు సరే.. సేనాని సంగతేంటి..?
ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై.. టీడీపీకి చెందిన ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడంతో పాటు ఆడియో, వీడియోలతో సహా పక్కా ఆధారాలు మీడియా ముందుకు తీసుకొని రావడంతో దీన్ని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదట పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వివరణ ఆ తీసుకోవడం, కేసు నమోదు చేయడం ఇవన్నీ చక చకా జరిగిపోయాయి. ప్రముఖ కొరియయోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. లైంగిక ఆరోపణలు వచ్చాయి. తోటి కొరియోగ్రాఫర్ యువతి హైదరాబాద్ లోని రాయదుర్గం ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారు..? ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై జనసేనతో పాటు ఇతర పార్టీల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
స్ఫూర్తిగా తీసుకుంటారా..?
అదుమూలం విషయంలో చంద్రబాబు స్పందించిన తీరుపై యావత్ తెలుగు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ తనకు చంద్రబాబే ఆదర్శం, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. జానీ మాస్టర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. చంద్రబాబు లాగే పవన్ కూడా జానీపై సస్పెన్షన్ వేటు వేస్తారా? లేదంటే లైట్ తీసుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జనసేనల్ స్టార్ క్యాంపైనర్ గా ఉన్న జానీని తొలగించి.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ సస్పెండ్ చేస్తే పరిస్థితి ఏంటి..? ఇప్పటికే మీడియా, సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సాగుతోంది. ఈ వ్యవహారంపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటో చూడాలి మరి..