తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై రేప్ కేసు నమోదు అయ్యింది. 21 ఏళ్ల లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా తనపై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు సదరు యువతి పేర్కొంది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు.. నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది.
కేసు ఏంటి..?
ఆ యువతి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసారు. తదుపరి విచారణ కోసం సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేయగా అతనిపై ఐపీసీ సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (02), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సెక్షన్ల కింద కేసులు అంటే చాలా స్ట్రాంగ్. జానీపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఐతే.. ఈ వ్యవహారంపై ఇంత వరకూ జానీ మాస్టర్ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు.
ఇదేం తొలిసారి కాదు!
జానీ మాస్టర్‌కు గతంలో సైతం నేర చరిత్ర ఉంది. 2015 లోనూ ఓ కాలేజీలో మహిళపై దాడి కేసులో.. 2019లో మేడ్చల్‌లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే అతను రాజకీయాల్లో చేరి జనసేన తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ శ్రేణులు ఓ రేంజిలో ఆడుకుంటున్నారు. ఫ్యాషన్, పొట్ట కూటి కోసం ఏదో డాన్సులు నేర్చుకోవాలని అనుకుంది పాపం.. మీరు ఏమో ఇలా కాటేస్తే ఎలా..? అని దుమ్మెత్తి పోస్తున్నారు.
గట్టిగానే..!!
జనసేన నేత, స్టార్ క్యాంపెనర్ జానీ మాస్టర్ చీకటి కోణం వెలుగులోకి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడిన కామెంట్స్ బయటికి తీసి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. చెప్పేది శ్రీ రంగ నీతులు..
దూరేది ఏమో దొమ్మరి గుడిసెలు..! అంటూ కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నారు. జానీ జానీ ఎస్ పాప.. గోకుడు గోకుడు నో పాప.. టెల్లింగ్ లైస్ నో పాప.. ఓపెన్ యువర్... చీ చీ..! ఇలా ఒకటా రెండా బాబోయ్ లెక్క లేనన్ని కామెంట్స్ వస్తున్నాయ్. మరోవైపు జనసేన పార్టీని.. అధినేత పవన్ పై కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మా అన్న ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పినా సరే ఈ సెక్షన్ల నుంచి బయటికి రావడం కష్టమే జానీ మావా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.