సీతారామం చిత్రానికి ముందు హిందీలో సినిమాలు చేసినా.. మృణాల్ ఠాకూర్ కి మాత్రం సౌత్ సీతారామం మూవీతోనే మంచి పేరొచ్చింది. సీత గా మృణాల్ ఠాకూర్ సౌత్ ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టించేసుకుంది. ఆతర్వాత హాయ్ నాన్న లో మోడ్రెన్ గా అందరికి చేరువైంది. ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచినా మృణాల్ ప్రస్తుతం హిందీ సినిమాల్తో బిజిగా కనబడుతుంది.
తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో తనకు బ్రేకప్స్ జరిగిన విషయాన్ని రివీల్ చేసింది. మన లైఫ్ లోకి సరైన వ్యక్తి వచ్చే వరకు చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారంటూ సింపుల్ గా చెప్పేసింది ఈ భామ. నేను గతంలో ఓ రిలేషన్ లో ఉన్నాను. కానీ నేను నటిని అయినందువలన అతను వద్దనుకున్నారు, తనది పద్దతి గల ఫ్యామిలీ అని చెప్పాడు. దానితో బ్రేకప్ చెప్పుకున్నాం.
అంతెందుకు ఏడు నెలల క్రితం కూడా ఓ బ్రేకప్ అయ్యింది. నన్ను పెళ్లి చేసుకునేవాడికి లుక్స్ బాగోకపోయినా మంచి మనసు ఉండాలి, అయితే నా లైఫ్ లో ఇలాంటి బ్రేకప్స్ జరిగినప్పుడు నేను మరీ అంత బాధపడిపోయేంత బ్రేకప్స్ అవ్వలేదు అంటూ మృణాల్ ఠాకూర్ తన లైఫ్ లో బ్రేకప్స్ కి అంత సీన్ లేదని చెప్పుకొచ్చింది.