హీరో లైనా, హీరోయిన్స్ అయినా పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కన్నాక ఆ పిల్లలకి కేర్ టేకర్ ని పెట్టుకుని మళ్ళీ వెంటనే తమ పనిలోకి దిగిపోతారు. అంటే షూటింగ్స్ వగైరా పనుల్లో బిజీ అయ్యి పిల్లలను చూసుకోవడానికి ఆయమ్మలను పెట్టుకుంటారు. ఇలా చాలామంది చేస్తూనే ఉంటారు. అందులో బాలీవుడ్ హీరోయిన్స్ చాలామంది పిల్లల కోసం కేర్ టేకర్స్ ని పెట్టుకుంటారు. బాలీవుడ్ లో కరీనా కపూర్, ఇక్కడ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇలా పిల్లల కోసం ఆయమ్మలను మైంటైన్ చేసేవారే.
తామే దగ్గరుండి పిల్లలను చూసుకోవాలంటే కెరీర్ ని పక్కనపెట్టాల్సి ఉంటుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న ఐష్ అప్పట్లో అభిషేక్ ని వివాహం చేసుకుని ఆరాధ్యకు జన్మనిచ్చాక తన కుమార్తె కోసం కెరీర్ నే వదులుకుంది. ఎలాంటి ఆయమ్మ లేకుండా తన బిడ్డను తానే పెంచుకుంది. ఇప్పుడు అలానే దీపికా పదుకోన్ కూడా తమ కుమార్తె కోసం ఇలాంటి డెసిషనే తీసుకుంది అంటున్నారు.
రీసెంట్ గానే రణవీర్ సింగ్-దీపికా పదుకోన్ జంట పాపకు జన్మనిచ్చింది. దీపికా పదుకోన్ ఇకపై తన పాపకు ఆయమ్మ అంటే కేర్ టేకర్ ని పెట్టుకుని తన సినిమా షూటింగ్స్ కు హాజరవుతుంది అనుకున్నారు అని దీపికా పదుకోన్ మాత్రం తన పాపకు ఆయమ్మను పెట్టుకోవాలనుకోవట్లేదట. తానే తన పాపకు సంరక్షకురాలిగా ఉండాలి అనుకుంటుందట. మరి అలా అయితే ఆమె సినిమాలు, షూటింగ్స్ పరిస్థితి ఏమిటో అని ఆమె అభిమానులు దిగులుపడుతున్నారు.