Advertisementt

శ్రీరెడ్డి చేసిన తప్పేంటి జగన్!!

Sun 15th Sep 2024 11:00 AM
anchor syamala  శ్రీరెడ్డి చేసిన తప్పేంటి జగన్!!
Sri Reddy vs Jagan శ్రీరెడ్డి చేసిన తప్పేంటి జగన్!!
Advertisement

అవును.. యాంకర్ శ్యామల సరే.. నటి శ్రీరెడ్డి చేసిన తప్పేంటి..? మాజీ మంత్రి రోజా సెల్వమణి.. శ్యామల ఒక్కటేనా..? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో నడుస్తున్న పెద్ద చర్చ ఇదే..! ఎందుకంటే.. వైసీపీ అధికార ప్రతినిధిగా శ్యామలను పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలు చేస్తున్న వారిలో ఎక్కువ మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉండటం గమనార్హం.

ఎందుకు.. ఏమైంది?

భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు, ఆర్కే రోజా సెల్వమణి, ఆరె శ్యామలను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా హై కమాండ్ నియమించింది. ఇందులో ఆరె శ్యామల అంటే మరెవరో కాదు టాలీవుడ్ నటి, యాంకర్ శ్యామల. ఎన్నికల ముందు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేసి.. గుంట నక్క కథ చెప్పి తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన ఆ శ్యామలే.. ఈ శ్యామల. ఇగో.. ఆమెకు అధికార ప్రతినిధిగా పదవి వచ్చిందో లేదో ఒక్కటే రచ్చ.. రచ్చ అయ్యింది. అదేంటి మిగిలిన ముగ్గురు, శ్యామల ఒక్కటేనా..? అసలు ఏం ఉద్దరించినది అని ఆ పదవి..? అసలు రోజాకు శ్యామలకు ఉన్న పోలిక ఏంటి..? ఆమెతో సమానంగా పదవి ఇవ్వడంలో ఆంతర్యమేంటి..? పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారికి మొండి చేయి చూపించి ఈమెకు ఎందుకు ఇచ్చారు..? అంటే ఎన్నికల ముందు అలా ఎన్నికల ప్రచారంలో రెండు డైలాగ్స్.. పోలింగ్ రోజు ముందు ఓ కథ (గుంట నక్క కథ) చెబితే అధికార ప్రతినిధి పదవి ఇచ్చేస్తారా..? అని సొంత పార్టీ వాళ్ళే దుమ్మెత్తి పోస్తున్నారు.

ఎవరితో ఎవరికి పోలిక..?

అధికార ప్రతినిధుల జాబితాలో ఉండే ఒక్కొక్కరి గురుంచి చెప్పుకుంటే.. భూమన కరుణాకర్ రెడ్డికి రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది. నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. ఎలాంటి విషయంపై అయినా సరే అనర్గళంగా మాట్లాడగల నేత. ఇక రోజా విషయానికి వస్తే.. సినిమాల్లో నుంచి టీడీపీతో రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజా నగరి నుంచి నాలుగు సార్లు పోటీ చేసి రెండు పర్యాయాలు ఓడి (2004, 2009).. ఇంకో రెండు సార్లు (2014, 2019) జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్ జగన్ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ఇక.. జూపూడి ప్రభాకర్ విషయానికి వస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ మంచి అనుభవం ఉన్న వ్యక్తి. మంచి వాక్చాతుర్యం కలిగి ఉన్న నేత. ప్రభుత్వ సలహాదారుగా, ఎమ్మెల్సీగా, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మెన్ గా, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం చాలానే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తయితే వైఎస్ హయాం నుంచి.. వైఎస్ జగన్ వరకూ వైఎస్ ఫ్యామిలీతో ఉంటున్నారు. చూశారుగా ఒక్కొకరి అనుభవం, సీనియారిటీ ఎలా ఉందో..! ఇప్పుడు చెప్పండి వీరి అనుభవం, ముందు శ్యామలకు ఉన్న అర్హతలు ఏంటి అనేది..? ఇదే ఇప్పుడు వైసీపీ శ్రేణులు, జగన్ వీరాభిమానులు, విమర్శకులకు సైతం అస్సలు నచ్చని పరిస్థితి. మీ నిర్ణయానికి.. మీకు దండాలు మహాప్రభో..? అంటూ వైసీపీ అధినేతకు దండం పెడుతున్నారు.

శ్రీరెడ్డి చేసిన తప్పేంటి?

ఒకవేళ శ్యామలకు ఇవ్వడంలో తప్పు లేదు అంటే.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని పిలిపించుకునే.. వైసీపీ కోసం సోషల్ మీడియా వేదికగా అహర్నిశలు కష్టపడిన.. నిత్యం ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ పనిచేసిన నటి శ్రీరెడ్డికి ఎందుకు ఇవ్వలేదు..? ఆమె చేసిన తప్పేంటి..? శ్యామల ఐనా నిన్న గాక మొన్నొచ్చిన మనిషి కదా.. శ్రీరెడ్డి 2014 నుంచి వైసీపీ కోసం పనిచేస్తోందిగా.. ఆమెను ఎందుకు పక్కనబెట్టారు..? చెప్పాలని వైసీపీ కార్యకర్తలు కొందరు డిమాండ్ చేస్తున్నారు. శ్యామల ఆఫ్ లైనులో ప్రచారం చేస్తే.. ఆన్ లైన్లో శ్రీరెడ్డీ చేసిందిగా.. ఇక పిట్ట కథలు, నక్క కథలు అంటారా..? ఇలాంటివి ఎప్పటి నుంచో, ఎన్నో శ్రీరెడ్డి చెబుతూనే ఉంది కదా..! మరి ఈమె ఎందుకు వైసీపీ పెద్దలు, ముఖ్యంగా జగన్ రెడ్డికి గుర్తు రాలేదు. అసలు ఈ పదవికి హోదా లేకుండా చేసారంటి..? పదవి ఎవరికీ ఇవ్వాలి.. ఎవరికీ ఇవ్వకూడదో.. తెలియదా..? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు. ఐతే శ్యామల భర్త నరసింహారెడ్డి.. కడప వాసి. ఈ రెండూ కలిసి వచ్చాయని తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రచారం చేసినందుకే సినిమాల్లో, కనీసం ఈవెంట్స్ కూడా రాకుండా పోయాయి అన్నది జగమెరిగిన సత్యమే. ఇక ట్రోల్స్ అంటారా అబ్బో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సామాన్యుడి నుంచి సినీ.. రాజకీయ సెలెబ్రిటీల వరకూ గట్టిగానే విమర్శలు వచ్చి పడ్డాయ్. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే శ్యామల పరిస్థితి ఏంటి..? పూర్తిగా పాలిటిక్స్ చేస్తారా..? లేదంటే పార్ట్ టైంగా మాత్రమే ఉంటారా..? అనేది చూడాలి మరి.

Sri Reddy vs Jagan:

Anchor Syamala is YSRCP official spokesperson

Tags:   ANCHOR SYAMALA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement