వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీ కోసం పని చేసిన యాంకర్ శ్యామల కు వైసీపీ పార్టీ ఓటమి పెద్ద దెబ్బె అనుకున్నారు. పాపం ఓడిపోయిన పార్టీలో ఉన్న శ్యామలను సినిమా ఇండస్ట్రీ కూడా పట్టించుకోదు, అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా శ్యామలకు అన్ని ఎదురు దెబ్బలే అనుకున్నారు. జనసేన నేత పవన్ కళ్యాణ్ ని పనిగట్టుకుని పనికిమాలిన విమర్శలు చేసిన శ్యామలను సినిమా ఇండస్ట్రీలో కన్సిడర్ చెయ్యరు అనుకున్నారు.
కట్ చేస్తే వైసీపీ అధినేత జగన్ శ్యామలకు వైసీపీ అధికార ప్రతినిధిగా పదవిని కట్టబెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ పార్టీలో రచ్చ అయ్యింది. భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు, ఆర్కే రోజా సెల్వమణి లకు రాజకీయంగా అనుభవం ఉంది. కానీ ఈ యంకర్ శ్యామలకు ఏం అనుభవం ఉంది.. జగన్ ఎలా శ్యామలకు పదవిని కట్టబెడతారంటూ వైసీపీ సీనియర్ నేతలు కినుకు వహించారు.
మరోపక్క శ్యామలకు పదవి వచ్చిందో లేదో ఇలా పనిలోకి దిగిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖా మంత్రి లోకేష్ లను విమర్శించేసింది. జగన్ ప్రజల కోసం కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు, లోకేష్ లు పిల్లికి బిచ్చం వెయ్యరు, వరద బాధితులకు ప్రతిపక్షం లో ఉన్న జగన్ కోటి విరాళం ఇచ్చాడు, వైజాగ్ బాధితుల కోసం ఒక్కొక్కరికి ఐదు లక్షలు సహాయం ప్రకటించారు, చంద్రబాబు, లోకేష్ ఏమిచ్చారు చెప్పండి బాబు అంటూ ఓ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయ్యో శ్యామలా పదవి రాగానే పని గుర్తుకు వచ్చిందా, పార్టీ ఓడిపోయాక సైలెంట్ గా ఉన్న నువ్వు ఇప్పుడు విమర్శలు చేసేందుకు ఏం అర్హత ఉంది అంటూ టీడీపీ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.