Advertisementt

బిగ్ బాస్ నుంచి షాకింగ్ కంటెస్టెంట్ అవుట్

Sun 15th Sep 2024 09:32 AM
bigg boss  బిగ్ బాస్ నుంచి షాకింగ్ కంటెస్టెంట్ అవుట్
Shocking contestant out of Bigg Boss 8 బిగ్ బాస్ నుంచి షాకింగ్ కంటెస్టెంట్ అవుట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 8 రెండు వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా మొదలైన సీజన్ 8 లోకి 14మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. సినిమా సెలబ్రిటీస్ ఎవరూ లేకపోయినా.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్స్, స్టార్ మా సీరియల్ ఆర్టిస్ట్ లు పాల్గొన్న  ఈ సీజన్ పై బుల్లితెర ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. 

ఇక సీజన్ 8 నుంచి మొదటి ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం ఏకంగా ఎనిమిదిమంది ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. అందులో నాగార్జున శనివారం ఎపిసోడ్ లో నైనిక, నిఖిల్ లను సేవ్ చేసారు. ఉన్న వారిలో ఈ వారం బిగ్ బాస్ హౌస్ ని వీడబోయే వారిలో ఎవరు ఉంటారనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. 

అయితే ఈ రోజు ఎపిసోడ్ ని శనివారమే షూట్ చెయ్యడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం లీకుల ద్వారా బయటికొచ్చేసింది. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టుగా టాక్ వినిపిస్తుంది. స్ట్రాంగ్ అనుకుంటున్న కంటెస్టెంట్ కు తక్కువ ఓట్లు పడటంతో బయటకువెళ్ళిపోయినట్టు తెలుస్తోంది.

ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు సీరియల్ నటుడు పృథ్విరాజ్. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న పృధ్విరాజ్ ఈ వారం బయటకు వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. 

Shocking contestant out of Bigg Boss 8:

Bigg Boss Telugu 8 Week 2 Elimination Update

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ