Advertisementt

దేవర: పోలా అదిరిపోలా..

Thu 03rd Oct 2024 10:44 AM
devara,kapil sharma show  దేవర: పోలా అదిరిపోలా..
Devara Promotions at Kapil Sharma Show దేవర: పోలా అదిరిపోలా..
Advertisement
Ads by CJ

దేవర గురించిన ముచ్చట్లు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ నెల 27న విడుదల కాబోతున్న దేవర మూవీ ప్రమోషన్స్‌ను టీం నార్త్ నుంచి మొదలు పెట్టింది. దేవర ట్రైలర్ తోనే ముంబైలో హడావుడి చేసిన ఎన్టీఆర్-జాన్వీ కపూర్‌లు అక్కడ బిగ్గెస్ట్ షో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కి దేవర ప్రమోషన్స్‌కు వెళ్లారు. 

హోస్ట్ కపిల్ శర్మ సెకండ్ సీజన్‌ను అనౌన్స్ చేశారు. సెప్టెంబరు 21వ తేదీ షో కొత్త ఎపిసోడ్‌ నెట్ ఫ్లిక్స్‌లో రాత్రి 8 గంటలకు స్ట్రీమింగ్ అవుతుందని చెప్పారు. తాజాగా సీజన్-2 ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయగా.. దానికి మాంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్‌లో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగా జాన్వీ కపూర్ అందంగా ఆకట్టుకుంది. సైఫ్ అలీ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి ఎన్టీఆర్-జాన్వీ కపూర్ లు ఈ షోకి వెళ్లగా షోలో దేవర టీమ్ ఆద్యంతం నవ్వులు పూయించిన విషయం ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.  

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైఫ్ సైగలకు ఫుల్‌గా నవ్వుతూ కనిపించారు. వారిద్దరి మధ్య జరిగిన గేమ్స్ కామెడీగా ఉన్నాయి. జాన్వీ కపూర్ ముత్యాలు పొదిగిన అదిరిపోయే డ్రెస్‌లో తళుక్కుమంది. అంతేకాదు తన ఫన్నీ హావభావాలతో అలరించింది. మరి ఈ షో కోసం నార్త్ ఆడియన్స్‌తో పాటుగా సౌత్ ప్రేక్షకులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. మొదట దేవర ప్రమోషనల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఇక దేవర ముంబై ప్రమోషన్స్ చూసిన నెటిజెన్స్ పోలా.. అదిరిపోలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Devara Promotions at Kapil Sharma Show:

Kapil Sharma Show Season 2 Starts with Devara Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ