Advertisementt

కేటీఆర్-హరీష్ మధ్య గొడవలు ఉన్నాయా.?

Thu 03rd Oct 2024 09:46 AM
ktr  కేటీఆర్-హరీష్ మధ్య గొడవలు ఉన్నాయా.?
Is there a feud between KTR-Harish Rao? కేటీఆర్-హరీష్ మధ్య గొడవలు ఉన్నాయా.?
Advertisement

కేటీఆర్-హరీష్ మధ్య గొడవలు ఉన్నాయా!?

బీఆర్ఎస్ పార్టీలో గొడవలు జరుగుతున్నాయా..? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీలో కట్టప్పగా పేరుగాంచిన హరీష్ రావు మధ్య గొడవలు ఉన్నాయా..? ట్రబుల్ షూటర్ ట్రబుల్స్ లో ఉన్నారా..? అంటే తాజా పరిణామాలు చూస్తుంటే ఇదే నిజమని అనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఎప్పటినుంచో అంతర్గత గ్రూపు రాజకీయాలు, నాయకత్వ పెత్తనం మీద కొట్లాట నడుస్తున్నదనే విషయాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి.

ఏం జరుగుతోంది..?

పైకి అలయ్.. బలయ్ అనుకుంటున్నా లోలోపల మాత్రం ఇద్దరికీ అస్సలు పడట్లేదు అన్నది పార్టీలో ఇప్పుడు పెద్ద ప్రచారమే జరుగుతోంది. ఈ అంతర్గత నాయకత్వ విభేదాలు సమయం, సందర్భం వచ్చిన ప్రతీసారి బహిర్గతమావుతూనే ఉన్నాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే.. కేటీఆర్ రైతు రణం కార్యక్రమం చేపట్టిన రోజు, హరీష్ రావు ఆలయాల యాత్ర, ఈ మధ్య ట్విట్టర్ వేదికగా పెరిగిన ట్వీట్లు, ఎయిర్ పోర్టులో కవితను సీఎం.. సీఎం.. అనే నినాదాలు ఇవన్నీ కట్టప్పకు అస్సలు రుచించలేదట. ఎందుకంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఐనా సరే అధినేత కేసీఆర్, జైలు నుంచి బయటికి వచ్చినా కవిత సైలెంట్, ఇక కేటీఆర్ మాత్రం ట్వీట్లకే పరిమితం కాగా.. వన్ అండ్ ఓన్లీ హరీష్ ఒక్కడే యాక్షన్ లోకి దిగిపోతున్నారు. ఎక్కడేం జరిగినా సరే అన్నింటా హరీష్ కనిపిస్తున్నారు.

ఎవరి గుప్పిట్లోకి గులాబి పార్టీ..!

కేసీఆర్ ఇప్పట్లో జనాల్లోకి వెళ్లే పరిస్థితులు ఏ మాత్రం లేవని.. అందుకే ఇద్దరిలో ఎవరో ఒకరికి పార్టీ బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తున్నారట. ఆ ఇద్దరిలో ఒకరు కేటీఆర్, ఇంకొకరు హరీష్ అట. జనాల్లో, పార్టీలో క్రేజ్ ఉండేది అల్లుడికే.. ఈయన ఒక్కమాట చెబితే ఎవరూ గీత దాటరు అని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయ్. కేటీఆర్ ఈ విషయాల్లో వీక్ కానీ.. సోషల్ మీడియాలో ఐతే కేటీఆర్ యమా యాక్టీవ్. అంటే జనాల్లో హరీష్, మీడియాలో కేటీఆర్ అని రెండు వర్గాలుగా విభజించి మరీ సొంత పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్న పరిస్థితి. దీనికి తోడు ఎమ్మెల్యేలు కూడా వర్గాలుగా ఉన్నారట. కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ ఎపిసోడ్ చక్కటి ఉదాహరణ అని విమర్శకులు చెబుతున్నారు. మొత్తం హరీష్ రావుకే క్రెడిట్ వస్తోందని.. తన వర్గం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కేటీఆర్ అమెరికా నుంచి అర్థరాత్రి హైదరాబాద్ చేరుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదికూడా ప్రత్యేక విమానంలో హుటాహుటిన హైదరాబాద్ రావడంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

నిజమెంత..!

కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ఇలా ప్రచారం.. లేనిపోని చిత్ర విచిత్ర కథనాలు వస్తున్నప్పటికి ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని అటు హరీష్.. ఇటు కేటీఆర్ కు అత్యంత సన్నిహితులు చెబుతున్న మాటలు. ఒకవేళ ఇదే నిజమైతే.. హైదరాబాద్ వచ్చిన కేటీఆర్.. బావ హరీష్ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి..? అస్సలు లేనే లేదు కదా..? కేటీఆర్ పరామర్శకు ఎందుకొస్తారు..? ఇక కేసీఆర్ అంటారా.. సమయం, సందర్భం వచ్చినప్పుడు కచ్చితంగా ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అని.. అనవసరంగా ఎవరెవరో ఏదేదో రాసేసుకుంటే.. ప్రసారం చేసుకుంటే అవన్నీ పట్టించుకొనక్కర్లేదు అని గులాబీ పెద్దలు చెబుతున్నారు. కేటీఆర్, హరీష్ ఏం చేసినా పార్టీ కోసమే.. కారు పార్టీకి ఊపిరిపోసి అధికారంలోకి తీసుకురావడం కోసమే అని కేసీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. బాపు బయటికి ఎప్పుడు వస్తారో.. ఇలాంటి పుకార్లకు స్వయంగా ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.

Is there a feud between KTR-Harish Rao? :

Are there differences between KTR and Harish Rao?

Tags:   KTR
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement