Advertisementt

మళ్ళీ నిరాశ పరిచిన కుర్ర హీరో

Fri 27th Sep 2024 12:52 PM
raj tarun,bhale unnade  మళ్ళీ నిరాశ పరిచిన కుర్ర హీరో
One More Flop to Young Hero Raj Tarun మళ్ళీ నిరాశ పరిచిన కుర్ర హీరో
Advertisement
Ads by CJ

కుర్ర హీరో రాజ్ తరుణ్‌కి కాలం కలిసి రావడం లేదో.. లేదంటే లావణ్యను మోసం చేసినందుకు శిక్ష పడుతుందో తెలియదు కానీ.. రాజ్ తరుణ్‌కు వరస అపజయాలు ఎదురవుతున్నాయి. రెండు నెలల్లో మూడు భారీ డిజాస్టర్స్ ఈ యంగ్ హీరోను తగులుకున్నాయి. గత నెలలో పురుషోత్తముడు రాజ్ తరుణ్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ సినిమాని రాజ్ తరుణ్ అసలు పట్టించుకోలేదు. 

ఆ తర్వాత వారానికే వచ్చిన తిరగబడరా సామి కూడా అతన్ని బాగా నిరాశ పరిచింది. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్‌లు, పర్సనల్ లైఫ్‌లో వివాదాలతో నలిగిపోయిన రాజ్ తరుణ్ నెమ్మదిగా కోలుకుని ఈ శుక్రవారం భలే ఉన్నాడే చిత్రంతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వరస ప్రమోషన్స్‌తో హడావిడి చేసినా ఆ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. 

ఓపెనింగ్స్ అటుంచి సినిమా చూసిన వాళ్ళు ఇక రాజ్ తరుణ్ పనైపోయింది అని మాట్లాడుకుంటున్నారు. రాజ్ తరుణ్ ఎంత బెస్ట్ ఇస్తున్నా అతనికి దొరికే కథలు, దర్శకులు అన్ని అవుట్ డేటెడ్ అన్నట్టుగా ఉండడంతో రాజ్ తరుణ్‌కు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చుట్టుముడుతున్నాయి. ఒకటా అరా కాదు వరసగా మూడు ప్లాప్‌లు. 

మరి రాజ్ తరుణ్ మళ్ళీ కోలుకునేలాంటి కథతో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేస్తాడా, లేదంటే వ్యక్తిగత విషయాలతో కెరీర్‌ని స్పాయిల్ చేసుకుంటాడో చూడాలి.

One More Flop to Young Hero Raj Tarun:

Raj Tarun Bhale Unnade Movie Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ