2024 ఎన్నికల ముందు వైసీపీ అధికారంలో ఉన్నంత వరకూ ఒక లెక్కా.. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక మరో లెక్క అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయి..! రెండ్రోజులకోసారి స్వయానా సీఎం చంద్రబాబు మీడియా, సమీక్ష సమావేశాలు, టెలీ కాన్ఫరెన్స్ మీటింగుల్లో.. అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయండి.. తమాషాగా ఉందా..? ఇలా ఒకటా రెండా చాలా సార్లు గట్టిగానే వార్నింగ్ ఇస్తూనే వస్తున్నారు..! అయినా సరే ఇసుమంత కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో మార్పు రావట్లేదు..! ఇందుకు చక్కటి ఉదాహరణ.. ఇదిగో ఈ ఒక్క ఫోటో చూస్తే మీకే అర్థం అవుతుంది..!
ఎందుకిలా..?
ఈ ఫోటోలో కాలు మీద కాలేసుకుని కూర్చున్న వ్యక్తిని గుర్తు పట్టారా..? పోనీ ఆయనకు ఎదురుగా కూర్చొని ఉన్న మంత్రులను అయినా గుర్తు పట్టారా..? అవును.. మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు ఉన్నారు కదా. వీరికి ఎదురుగా ఉండే వ్యక్తి ఎవరో కాదు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా. చూశారుగా ప్రజాప్రతినిధులు, మంత్రులతో ఆయన ప్రవర్తించిన తీరు.. ఈ విచిత్రమైన వ్యవహరశైలితో ఇప్పుడు మీడియాలో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఈయన ప్రవర్తనతో తోటి ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి వచ్చిందట.
ఏమైంది సారూ..!
ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు కానీ.. మంత్రులు సిసోడియా ఏదో విషయంపై వివరిస్తున్నట్టుగా ఉంది.. అంత వరకూ ఓకేగానీ కాలు మీద కాలేసుకుని ఆ హావ భావాలు ఏంటో..? ఎవరికీ అర్థం కావట్లేదు. మంత్రులు అంటే లెక్క లేదా..? లేదంటే మీకు నాకు చాలా తేడా ఉంది అంటూ ఇలా చేశారా..? ఇవన్నీ కాదంటే మంత్రులు వస్తుంటారు.. పోతుంటారు.. ఐఏఎస్ లోకల్ అని ఫీల్ అవుతున్నారో అర్థం కావట్లేదు. సిసోడియా వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమిటీ బలుపు, ఎందుకు ఇంత అహంకారం అంటూ జనాలు మండిపడుతున్నారు.
నేరమా.. కాదా..?
కాలు మీద కాలు వేసుకోవడం అస్సలు నేరం కానే కాదు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ ఎక్కడ ఎలా ఉండాలి..? ఎవరితో ఎలా మాట్లాడాలి..? ఎలా ప్రవర్తించాలి..? అనేది కనీసం తెలిసి ఉండకపోతే ఎలా..? ఒక పద్ధతీ పాడు లేకపోతే ఎలా ఐఏఎస్ అంటూ ఆ మంత్రుల వీరాభిమానులు కన్నెర్రజేస్తున్నారు. మహారాజు దర్శనం కోసం ప్రజలు వచ్చినట్టు.. ఏంటి సంగతులు అన్నట్టుగా ఉంది..? మీ వ్యవహారం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొన్ని వర్గాల నుంచి మరో రీతిలో కామెంట్స్ వస్తున్నాయ్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నిత్యం సీఎం చంద్రబాబు బంతాట ఆడుకుంటున్నారు అని.. అందుకే మంత్రులను, వాళ్ళు ఇలా ఆడుకుంటున్నారని గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఇదిగో ఈ సిసోడియా వల్లనే యావత్ ఐఏఎస్‌లకే చెడ్డ లేరు వస్తోందని.. దీనికి తోడు ప్రజలకు కూడా నమ్మకం సడలిపోతోందని విమర్శలు వస్తున్నాయి.