కన్నడ హీరో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ కోసం అభిమాని రేణుకస్వామిని అత్యంత పాశవికంగా హత్య చేయించిన కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం బళ్ళారి జైలులో ఉన్న దర్శన్ తో పాటుగా అతని ప్రేయసి పవిత్ర గౌడ కూడా జైలులోనే ఉంది. వీరిద్దరితో పాటుగా మరో 15 మంది రేణుక స్వామి హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నారు.
రీసెంట్ గా దర్శన్ కు పరప్పర జైలులో రాజభోగాలు అందుతున్నాయనే కారణంతో జైలు అధికారులు దర్శన్ ను హుటాహుటిన భారీ బందోబస్తు మధ్యన బళ్ళారి జైలుకు మార్చేసారు. అక్కడ కూడా దర్శన్ లో పశ్చాత్తాపం కనిపించడం లేదు.. పోలీసులకు, మీడియాకు మిడిల్ ఫింగర్ ని చూపించాడని దర్శన్ ను నెటిజెన్స్ ఆడుకున్నారు.
ఇక తాజాగా రేణుక స్వామి హత్య కేసులో దర్శన్ కు బెయిల్ విషయంలో కోర్టు చుక్కలు చూపిస్తుంది. మరోసారి దర్శన్ అండ్ కో కు కోర్టు నిరాశనే మిగిల్చింది. కొద్దిరోజుల క్రితం దర్శన్ అతని గ్యాంగ్ రేణుక స్వామి ని హత్య చేసినప్పుడు తీసిన ఫొటోస్, వీడియోస్ పోలీసులకు దొరకడంతో దర్శన్ అండ్ కో కి ఈ కేసులో మరింతగా ఉచ్చు బిగుసుకుంది. దానితోనే కోర్టు దర్శన్ కస్టడీని ఈ నెల 17 వరకు పొడిగించింది.
రేణుక స్వామి హత్య కేసులో పక్కా ఆధారాలతో దర్శన్, పవిత్ర గౌడపై పోలీసులు ఛార్జ్ షీట్ రెడీ చేసారు. దానితో దర్శన్ కు కోర్టులో మరోసారి చుక్కెదురైంది.