వైఎస్ జగన్ రెడ్డికే మైండ్ బ్లాంక్!
అవును.. వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే మైండ్ బ్లాంక్ అయ్యిందట. ఎక్కడికెళ్లినా.. ఎటు చూసినా జనమే.. జనం..! దీనికి తోడు ఎవరినోట చూసినా నినాదాలే..! ఎన్నికల ముందు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అంతకు మించి పరిస్థితులు. అన్నీ సరే తప్పు ఎక్కడ జరిగింది..? ఎలా జరిగింది..? నా అక్కలు, నా చెల్లెమ్మలు, అన్న దమ్ముళ్ళు.. పెద్దలు అందరూ ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.. ఎక్కడికెళ్లినా ఆదరిస్తున్నారు..? ఇక తేడా ఎక్కడ కొట్టింది..!
ఏం జరుగుతోంది..!
పులివెందులకు వెళ్ళినా.. గుంటూరు వెళ్ళినా.. విజయవాడ వెళ్ళినా.. ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా పిఠాపురం వెళ్ళినా ఇసుకేస్తే రాలనంతగా జనం.. సీఎం సీఎం అంటూ నినాదాలు.. జనం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు! పులివెందుల నుంచి పిఠాపురం వరకూ అదే జనం, అంతకు మించి ఆదరణ అన్నీ సరే.. ఎలా ఓడిపోయాం..? ఎందుకు ఓడిపోయాం..? జనం ఎందుకు ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయలేదు..? అని వైఎస్ జగన్ రెడ్డికే అంతు చిక్కడం లేదట.. ఆలోచించి.. ఆలోచించి దెబ్బకు మైండ్ బ్లాంక్ అవుతోందట.
గాలి తీసేస్తున్నారుగా!
ఆ జనం, ఆదరణ, నినాదాలు చూసి వైసీపీ శ్రేణులు...అహా ఓహో అని అభిమాన నేతను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయాం అంతే.. పోయింది అధికారం మాత్రమే అభిమానం కాదు అని ఫ్యాన్స్ తెగ చెప్పుకుంటున్నారు. మీ విలువ తెలుసుకోడానికి ఎన్నో రోజులు పట్టలేదు.. నువ్వు ప్రజల్లోనే ఉండాలి జగన్ అన్నా.. వెలివేశామయ్య గుళ్ళో దేవుణ్ణి.. అంటూ అబ్బో పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇస్తున్నారు. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్ చూడలేక.. టీడీపీ కార్యక్తలు కొందరు గట్టిగానే ఇచ్చి పడేస్తున్నారు. ఎక్కడికెళ్లినా జనం ఫుల్.. ఓట్లు మాత్రం నిల్.. ఇక మ్యాటర్ అంటారా అదీ అంతకు మించి నిల్.. అతి ఐతే ఫుల్ లెక్కలేనంతగా.. ఎందుకు ఎలా ఓడిపోయాం అని తెలుసుకోవడం, నేర్చుకోవడం, మార్చుకోవడం మాత్రం నిల్.. జనరల్ నాలెడ్జ్ నిల్ అంటూ వైసీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడే రీతిలో కౌంటర్లు పేలుస్తున్నారు. ఏదేమైనా లోపం ఎక్కడుందో వైఎస్ జగన్ తెలుసుకుంటే మంచిది మరి.