మిల్కి బ్యూటీ తమన్నా ఇప్పటికీ కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా లాక్కోస్తుంది. స్టార్ హీరో అవకాశాలు తగ్గితేనేమి, లేడీ ఓరియెంటెడ్ మూవీస్, వెబ్ సీరీస్ లు అవకాశమొస్తే ఐటెం సాంగ్స్ లో దున్నేస్తుంది. రీసెంట్ గా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ స్త్రీ 2 లో తమన్నా స్పెషల్ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం సౌత్ లో ఓదెల 2 షూటింగ్ లో పాల్గొంటున్న తమన్నా బాలీవుడ్ లో మాత్రం బిజీ బిజీగా కనిపిస్తుంది. అయితే విజయ్ వర్మ తో లవ్ లో ఉన్న తమన్నా ఈ మధ్యన తాను గతంలో రెండు బ్రేకప్స్ వలన సఫర్ అయిన విషయాన్ని రివీల్ చేసింది. ఇక విజయ్ వర్మతో పెళ్లి విషయంలో మాత్రం తమన్నా చాలా సీక్రెట్ ని మైంటైన్ చేస్తుంది.
తాజాగా తమన్నా తల్లి కావాలంటే భయమేస్తుంది అంటూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తల్లి అంటే పిల్లలకు అన్ని ఇస్తుంది, నా పిల్లలకు అంత ప్రేమ, కేరింగ్ నేను ఇవ్వలేనని చెప్పిన తమన్నా నా పేరెంట్స్ నాకు చాలా ప్రేమ పంచారు, వారిని చూస్తుంటే తల్లితండ్రులుగా ఎలా ఉండాలో డిగ్రీ తీసుకున్నట్లు అనిపిస్తుంది.
నాకు పిల్లలు జన్మించాక ఏం జరుగుతుందో అనే భయం ఉందని తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి. అది విన్న నెటిజెన్స్ తమన్నాకు పిల్లలంటే ఎందుకంత భయం అంటూ కామెంట్ చేస్తున్నారు.