అవును.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక పూర్తిగా మారిపోయారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారు. రూట్ బాగానే ఉంది కానీ.. ఏం జరుగుతుందో అని కార్యకర్తలు, అభిమానులు ఒకింత కంగారు పడుతున్న పరిస్థితి. ఇంతకీ పవన్ చేసిందేంటి..? ఇప్పుడు ఎందుకు ఇంతలా హాట్ టాపిక్ అయ్యింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి.
ఇదీ అసలు సంగతి!
డిప్యూటీ సీఎం తీసుకున్న నిర్ణయం ఒకింత సంచలన నిర్ణయమే తీసుకున్నారు. మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడలోని తన ఆఫీస్, ఫర్నిచర్, ఇతర సామాగ్రీని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో పవన్ రాశారు. అంతే కాదు.. విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని కేటాయించడం పట్ల చంద్రబాబుకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఇకపై.. మంగళగిరిలోని నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నానని అందుకే విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడం జరిగింది.
నాడు.. నేడు..!
వైసీపీ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తాడేపల్లిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధిరంలో ఉండి.. అందులోనూ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పటికీ క్యాంపు ఆఫీసు నుంచే మొత్తం నడిపించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడే పవన్ కూడా అదే పద్ధతిలో.. బాటలో నడుస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. మంగళగిరిలో ఉన్న ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చేశారు. ఐతే.. జగన్ ఇలా చేసి ఘోర ఓటమికి గురయ్యారని.. పవన్ ఎందుకు ఇలా చేస్తున్నారనే సందేహాలు కూడా అభిమానులు, కార్యకర్తల్లో వస్తున్నాయ్. చూడాలి మరి విజయవాడను కాదని మంగళగిరిలో వెళ్తున్న పవన్ ఏ మాత్రం సక్సెస్ అవుతారో.. ఏంటో..!