రాజమౌళి-మహేష్ బాబు SSRMB ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళుతుందా అని పాన్ ఇండియా అభిమానులు, మహేష్ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు యుఎస్ నుంచి వచ్చేసారు, రాజమౌళి SSRMB ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బాగా బిజీ గా ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అప్ డేట్ రాబోతుంది.
మహేష్ న్యూ లుక్స్ తో SSRMB కోసం మేకోవర్ అవుతున్నారు. లాంగ్ హెయిర్, ఫుల్ గడ్డంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సూపర్ లుక్ లోకి మారిపోయారు. తాజాగా SSRMB ప్రాజెక్ట్ బ్యాక్ డ్రాప్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి- మహేష్ మూవీ.. 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ తో రూపొందనుందని సినీ సర్కిల్స్ లో జోరు ప్రచారం జరుగుతుంది.
కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీతో పీరియాడిక్ డ్రామాగా రాజమౌళి మహేష్ తో చేసే మూవీని తెరకెక్కించబోతున్నారట. రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి ఇప్పటికే తన వర్క్ ను స్టార్ట్ చేసేసారట. ఈ చిత్రంలో 200 మందికి పైగా ఆర్టిస్టులు భాగమవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కి కావాల్సిన లొకేషన్స్ ను రాజమౌళి ఎప్పుడో లాక్ చేసేసారట. అంతేకాకుండా నటుల ఎంపికలోనూ రాజమౌళి కాంపౌండ్ తలమునకలై ఉందట.