మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులను సింగర్ మనో కొడుకులు ఇంకా కొంతమంది దాడి చేసిన ఘటన చెన్నై లో కలకలం సృష్టించింది. సింగర్ మనో కొడుకులు పరారీలో ఉండడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఏం జరిగింది అంటే చెన్నై ఆలాపక్కం కు చెందిన కృపాకరన్, మధురవాయ్ కు చెందిన 16 ఏళ్ళ బాలుడు శ్రీదేవి కుప్పం లోని ఫుడ్ బాల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
మంగళవారం రాత్రి తమ ట్రైనింగ్ ముగించుకుని పక్కనే ఉన్న హోటల్ లో డిన్నర్ చేసేందుకు వెళ్లిన సమయంలో సింగర్ మనో కొడుకుతో సహా మరో ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్, ఆ బాలుడు తో గొడవకు దిగారు, ఆ గొడవలో గాయపడిన కృపాకరన్ దగ్గరలోని ఆసుపత్రిలోకి చేరి మనో కొడుకులు, మిగతా ఐదుగురు పై కంప్లైట్ ఇచ్చాడు.
దానితో వలసరవక్కం పోలీసులు సింగర్ మనో కొడుకులు రఫిక్, సాహిర్ ఇంకా వారి స్నేహతులపై కేసు నమోదు చేసి అందులో ఇద్దరిని అరెస్ట్ కూడా చేసారు. కానీ సింగర్ మనో కొడుకులు తప్పించుకోవడంతో పోలీసులు వారి కోసం వెతుకులాట ప్రారంభించారు.