రీసెంట్ గా నేపోటిజం పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పినట్టుగా బాలీవుడ్ లో మాత్రం అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. అందుకే హిందీలో స్టార్ కిడ్స్ కి ఉన్న సినిమా అవకాశాలు మనకు రావు అంటూ రకుల్ మాట్లాడడం చూసి తాను హిందీలో పాపులర్ అవుదామనుకుని కలలు కని ఇప్పుడు డిజ్ పాయింట్ అవుతుంది అనుకునేలా ఉంది.
ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ తో అభిమానులను అలరించే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా వదిలిన పర్పుల్ కలర్ మోడ్రెన్ డ్రెస్ ఫోటో షూట్ మాత్రం అదిరిపోయింది అనేలా ఉంది. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ అన్నట్టుగా రకుల్ ప్రీత్ లేటెస్ట్ ఫోటో షూట్ ఉంది.
రీసెంట్ గా రకుల్ ప్రీత్ భర్త జాకీ భగ్నానీ తో కలిసి వినాయక చవితి వేడుకలను తన ఇంట్లోనే అద్భుతంగా సెలెబ్రేట్ చేసుకుంది. వినాయక చవితి వేడుకలకి రకుల్ ఇంటికి లక్ష్మీ మంచు, ప్రగ్య జైస్వాల్ కూడా హాజరయ్యారు. ఎందుకంటే రకుల్ కి వారు మంచి ఫ్రెండ్స్.