ఆర్.ఆర్.ఆర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఎంత మంచి దోస్త్ లు అనేది అందరూ చూసారు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్-చరణ్ లు కలిసి చేసిన సందడి ఇప్పటికి ఎవరూ మరిచిపోరు. ఆ తర్వాత కూడా వీళ్ళ స్నేహాన్ని అందరూ చూసారు. ఎన్టీఆర్-చరణ్ ఎక్కడ కలిసి కనబడినా అభిమానులకు పండగే.
ఇప్పుడు ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఏపీకి ప్రకటించిన వరద సహాయార్ద విరాళాన్నీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు అందజేసేందుకు విజయవాడకు వెళ్ళబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఏపీ వరదల నష్టాల్లో తమ వంతు బాధ్యతగా ఎన్టీఆర్ 50 లక్షలు విరాళం ప్రకటించాడు, తెలంగాణకు కూడా 50 లక్షల సహాయం ప్రకటించాడు. ఇటు చరణ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
అందుకే ఆ చెక్కులను ఎన్టీఆర్-చరణ్ కలిసి చంద్రబాబు కు అందించేందుకు ఏపీకి బయలుదేరుతున్నారని అన్నారు. కానీ ఇదంతా ఫేక్ న్యూస్ అని, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఏపీకి చంద్రబాబు ను కలిసేందుకు వెళ్లడం లేదు అని సమాచారం. ఫేక్ న్యూస్ అయినా అభిమానులు మాత్రం చాలా ఎగ్జైట్ అయ్యారు.