రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసి బుచ్చి బాబు తో మొదలు పెట్టిన RC16 షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆస్ట్రేలియా లో రామ్ చరణ్ RC16 కోసం స్పెషల్ గా మేకోవర్ అవనున్నారనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఎప్పటి నుంచో బుచ్చిబాబు ప్రీ ప్రొడక్షన్, అలాగే నటీనటుల ఎంపికలో తలమునకలై ఉన్నాడు.
రామ్ చరణ్ ఒక్కసారి RC16 సెట్స్ మీదకి వస్తే షూటింగ్ కి బ్రేకులు లేకుండా స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేసుకున్న బుచ్చి బాబు ఈచిత్రం కోసం టాప్ టెక్నీషియన్స్ ని తీసుకోస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహ్మాన్ ని తీసుకున్న బుచ్చి బాబు RC16 విలన్ కేరెక్టర్ కోసం కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను పట్టుకొచ్చాడు.
అయితే బుచ్చిబాబు RC16 సెట్ కోసమే భారీ బడ్జెట్ పెడుతున్నాడనే వార్త వైరల్ గా మారింది. RC16లో కొన్ని సెట్స్ కోసం బుచ్చి బాబు భారీగా ఖర్చు పెడుతున్నాడట. ఒరిజినల్ లుక్ కోసం ఎక్కడా క్రాంప్రమైజ్ కాకుండా సెట్లు డిజైన్ చేయిస్తున్నాడట. రామోజీ ఫిలిం సిటీలో RC1 సెట్ల నిర్మాణం జరుగుతుందని సమాచారం.
RC16 సంబంధించిన ఆర్ట్ వర్క్ ఏడాదిన్నర కాలంగా జరుగుతుందట. అందుకు అనుగుణంగా సెట్ల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల చివరి వారం నుంచి బుచ్చిబాబు-రామ్ చరణ్ RC16 సెట్స్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.