యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రెండున్నరేళ్ల గ్యాప్ తో దేవర పాన్ ఇండియా ఫిలింతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం పై సోషల్ మీడియాలో మెగా అభిమానులు నెగెటివ్ ట్రోలింగ్ తో రెచ్చగొడుతున్నారు.
మెగా హీరోలకు ఆచార్య లాంటి బిగ్ డిసాస్టర్ ఇవ్వడంతో మెగా అభిమానులు కొరటాల శివ పై ఉన్న కోపాన్ని ఎన్టీఆర్ దేవర పై చూపిస్తున్నారు. దేవర ట్రైలర్ దేవర సాంగ్స్, దేవర పోస్టర్ ఇలా దేవర నుంచి ఏ అప్ డేట్ వచ్చినా దానిని మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ మెగా అభిమానులే కాదు.. నార్త్ లో ఓ వర్గం దేవర పై ట్రోలింగ్ మొదలు పెట్టింది
తాజాగా ముంబై లో దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి జై కొట్టడాన్ని ఓ జర్నలిస్ట్ తప్పుబట్టడమే కాదు, అది పెయిడ్ బ్యాచ్ అంటూ ఎన్టీఆర్ ని అవమానించేలా మాట్లాడాడు. టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ బాక్సాఫీసు మీద దండయాత్ర చెయ్యడం నార్త్ లో చాలామందికి నచ్చడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడు టాలీవుడ్ హీరోలను ఇలా కించపరుస్తున్నారు.
దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కొంతమంది జర్నలిస్ట్ లు ముందు వరసలో కూర్చున్నారు, మా వెనుక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్స్ ఉన్నారు. ఆ వెనుకగా కొంతమంది కూర్చుని జై ఎన్టీఆర్ అంటూ దేవర ట్రైలర్ ని కూడా చూడనివ్వలేదు. కొన్ని డైలాగ్స్ అర్ధం కాలేదు. వారంతా నిజమైన అభిమానులు కాదు, పెయిడ్ బ్యాచ్.. అంటూ ఆ జర్నలిస్ట్ మాట్లాడడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి విపరీతమైన కోపమొచ్చేసింది.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తనకి జై జై లు పలకడం కోసం డబ్బుచ్చి అభిమానులను కొనుక్కోవాలా ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆ జర్నలిస్ట్ ను సోషల్ మీడియాలో ఏసుకుంటున్నారు.