ఈటీవీలో గురు,శుక్రవారాల్లో ప్రసారం కావాల్సిన కామెడీ షో జబర్దస్త్ ఇపుడు శుక్ర, శనివారాల్లో రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమవుతుంది. జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా ను తొలగించి రెండు రోజుల్లోనూ జబర్దస్త్ అనే పేరునే యాజమాన్యం కంటిన్యూ చేస్తుంది. ఇక రెండు షోస్ కి యాంకర్ గా రష్మీ నే వస్తోంది. జడ్జ్ లుగా ఒకరోజు కృష్ణభగవాన్, ఇంద్రజ వస్తే, మరొక రోజు కృష్ణ భగవాన్, ఖుష్బూ వస్తున్నారు.
ఈమధ్యన ఇంద్రజ షో నుంచి తప్పుకుంది, ఆమె స్తానంలో ఎవరో ఒకరు స్పెషల్ గా జడ్జ్ ప్లేస్ లోకి వస్తున్నారు. ఇప్పుడు తాజాగా కృష్ణ భగవాన్ స్థానంలో జబర్దస్త్ కి ఓ కొత్త జడ్జ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనెవరో కాదు మాజీ హీరో శివాజీ. గత ఏడాది బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చిన శివాజీ ఆతర్వాత 90s - A Middle Class Biopic తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇప్పుడు తాజాగా శివాజీ జబర్దస్త్ కి జడ్జ్ గా వచ్చాడు. కొత్త జడ్జ్ కు రష్మీ, ఇంకా జబర్దస్త్ కమెడియన్స్ స్వాగతం చెప్పిన ప్రోమో వైరల్ అయ్యింది. అంతేకాదు కమెడియన్స్ అప్పుడే శివాజీ పై కామెడీ స్కిట్ కూడా చేసేసారు. దానితో శివాజీ అరె నన్ను ఈ షోలో ఉండమంటారా వెళ్ళొమ్మంటారా అంటూ సరదాగా మాట్లాడిన ప్రోమో వైరల్ గా మారింది.