బాలీవుడ్ లో నేపోటిజం పై ఎప్పటికప్పడు ఎవరో ఒకరు చేసే కామెంట్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. స్టార్ కిడ్స్ పై కంగనా రనౌత్ లాంటి హీరోయిన్స్ చేసే కామెంట్స్ చూస్తూనే ఉంటాము, స్టార్ కిడ్స్ వలన నేపోటిజం పెరిగిపోయింది, అందువల్ల మాకు అవకాశాలు రావడం లేదు అని చాలామంది మొత్తుకున్నట్టే రకుల్ ప్రీత్ కూడా స్టార్ కిడ్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
నేపోటిజం కారణంగా తమకు సినిమా అవకాశాలు రావడం లేదు, దాని వల్ల నేను చాలా నష్టపోయాను, స్టార్ కిడ్స్ అంటే వారికే అవకాశాలు వస్తాయి. కానీ ఆ విషయంలో నాకు బాధలేదు. నాకు సినిమా అవకాశాలు నేపోటిజం వల్ల చేజారిపోతే దాని కోసం బాధపడను, నాకు ఆ సినిమా రాసిపెట్టి లేదు అనుకుంటాను.. అంటూ రకుల్ ప్రీత్ నేపోటిజం పై చేసిన కామెంట్స్ దుమారాన్ని లేపుతున్నాయి.
సౌత్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కు వెళ్లి సెటిల్ అయిన రకుల్ ప్రీత్ కి అక్కడ ఆమె ఆశించిన అవకాశాలు అయితే రాలేదనే చెప్పాలి. సీనియర్ హీరోలు, చిన్నా చితకా పాత్రలకు హిందీలో పరిమితమైన రకుల్.. ఇప్పుడు స్టార్ కిడ్స్ పై చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అయ్యాయి.