హరీష్ రావు అరెస్ట్.. చెయ్యికి తీవ్ర గాయం
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు గులాబి పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బలవంతంగా లాక్కెళ్లి.. వాహనాలు ఎక్కించే క్రమంలో హరీష్ చెయ్యికి తీవ్ర గాయం అయ్యింది. అయినప్పటికీ పోలీసులు హరీష్, పదుల సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు హీట్ పెరిగిపోయాయి. ఈ అరెస్టుతో తీవ్ర ఆగ్రహానికి లోనైన హరీష్.. తెలంగాణ అభిమానులు పదివేల మంది ఈరోజు రాత్రి (గురువారం) వరకు సైబరాబాద్ కమీషనరేట్ రావాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీలుగా ఉన్న పరిస్థితులు యూటర్న్ తీసుకున్నాయి.
ఎందుకీ అరెస్ట్..!
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకాకుండానే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది అధిష్ఠానం. దీంతో.. అసలు బీఆర్ఎస్ పార్టీ నేతలకు అందులోనూ హరీష్ లాంటి సీనియర్ నేతలను ప్రతిపాదిస్తే వారికి ఇవ్వకుండా గాంధీజీ ఎందుకు ఇచ్చారు అని మొదలైన వివాదం.. ఇప్పుడు అరెస్టుల దాకా వెళ్లింది. సీన్ కట్ చేస్తే.. యంగ్ లీడర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీగా పరిస్థితులు మారిపోయాయి. ఎంతలా అంటే నువ్వెంత.. నువ్వెంత అని సవాళ్లు, ప్రతి సవాళ్లు.. అసలు నువ్వు తెలంగాణ వాడివేనా అనే పరిస్థితికి వెళ్లింది. దీంతో ఒక్కసారిగా లోకల్.. నాన్ లోకల్ అంటూ గొడవలు మొదలు అయ్యాయి. ఈ క్రమంలో తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలను వెనకేసుకుని కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి తెగబడ్డారు గాంధీ. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో వాతావరణం మారిపోయింది.
హరీష్ ఇలా వచ్చారు..!
ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు అండగా హరీష్ రావు వచ్చారు. కౌశిక్ ఇంటికెళ్ళి పరామర్శించి.. ఈ దాడి, మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యేను వెంటబెట్టుకుని సైబరాబాద్ సీపీ ఆఫీసుకు వెళ్ళారు. ఫిర్యాదు తీసుకోవాలని నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు మొదట కొందరు నేతలు, ఆ తర్వాత హరీష్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో 10 వేల మంది తెలంగాణ అభిమానులు రావాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో ఇవాళ నైట్ మరింత ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతే కాదు అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా రంగంలోకి దిగి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడానికి అంతు చిక్కడం లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.