Advertisementt

దేవర సెన్సార్ కట్స్ ఇవే!!

Thu 12th Sep 2024 01:47 PM
devara  దేవర సెన్సార్ కట్స్ ఇవే!!
Devara Censor Report దేవర సెన్సార్ కట్స్ ఇవే!!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో ఈ నెల 27 న విడుదల కాబోతున్న దేవర చిత్రం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలయ్యాయి. ముంబై లో దేవర ట్రైలర్ లాంచ్ తర్వాత దేవర పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దేవర ట్రైలర్ విడుదలైన రోజే సెన్సార్ కి వెళ్ళిపోయింది. దేవర రన్ టైం 2.47 నిమిషాలుగా ఉంది. 

అందులో టైటిల్స్, ఎండ్ టైటిల్స్ తో కలిపి 2.57 నిమిషాల కట్ తో దేవర నిడివి ఉంది. ఇక దేవర లో సెన్సార్ సభ్యులు కొన్ని కట్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో ఒక వ్యక్తి తన భార్య కడుపు మీద తన్నే సీన్, కుంజర అనే అతని కొడుకు తన తల్లిని కొట్టే సీన్ తో పాటుగా కత్తికి వేలాడదీసిన ఒక బాడీ సీన్, అంతేకాకుండా ఫైనల్ గా సొర చేప విజువల్ లో సిజిఐ మార్క్ వేయలేదని ఈ నాలుగు సీన్స్ దేవర లో ఉండరాదు అని కట్స్ చెప్పారట. 

టోటల్ గా 7 సెకండ్స్ కట్స్ లో 2 సెకండ్స్ రీప్లేస్ చేసినట్టుగా తెలుస్తుంది. దేవర కు సెన్సార్ బోర్డు వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం పై విపరీతమైన క్రేజ్ ఉంది. దేవర ఓపెనింగ్స్ తోనే సరికొత్త రికార్డ్ నెలకొల్పేలా దేవర బుకింగ్స్ ఉన్నాయి. 

Devara Censor Report:

Devara Censor Report Details 

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ