Advertisementt

నిర్దారణ అయినా హేమ ఒప్పుకోవట్లేదు!!

Thu 12th Sep 2024 12:20 PM
hema  నిర్దారణ అయినా హేమ ఒప్పుకోవట్లేదు!!
Hema does not agree even if confirmed!! నిర్దారణ అయినా హేమ ఒప్పుకోవట్లేదు!!
Advertisement
Ads by CJ

హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆమె బ్లడ్ శాంపిల్స్ లో నిర్దారణ అయినట్లుగా బెంగుళూరు పోలీసులు ఛార్జ్ షీట్ రెడీ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేను రేవ్ పార్టీలో పాల్గోలేదు అంటూనే నా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, అందులో నెగెటివ్ వచ్చింది, నేను డ్రగ్స్ తీసుకోలేదని ప్రూవ్ అయ్యింది, నన్ను మీడియానే ఇరికించింది, నేను తప్పు చెయ్యలేదు అంటూ మొత్తుకుంది.

కానీ ఈరోజు హేమ డ్రగ్స్ రిపోర్ట్ లో పాజిటివ్ అంటూ, ఛార్జ్ షీట్ అంటూ వార్తలు రావడంతో హేమ హడావిడి గా ఓ ఛానల్ కి లైవ్ లోకి వచ్చింది. నేను ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకోలేదు, బెంగుళూరు పోలీస్ ఛార్జ్ షీట్ లో నా పేరు రావడం ఇప్పుడే తెలిసింది. నేను డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ ఛాలెంజ్ చేసింది. 

పోలీస్ ఛార్జ్ షీట్ నాకు చేరాక నేను దానిపై స్పందిస్తాను, నాకు ఉన్న సమాచారం మేరకు నా శాంపిల్స్ నెగెటివ్ అని ఛార్జ్ షీట్ రెడీ చేసారు, MDMA అనే డ్రగ్ నేను తీసుకోలేదు. కొన్ని మీడియా సంస్థల వల్ల నా పేరు ఛార్జ్ షీట్ లో పెట్టారంటూ మళ్ళీ హేమ వాదిస్తుంది. 

Hema does not agree even if confirmed!!:

Hema does not agree yet

Tags:   HEMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ