నటి హేమ బెంగుళూరు రేవ్ పార్టీలో పోలీసులకు దొరికిపోయి డ్రగ్స్ తీసుకుంది లేనిది నిర్దారణ కోసం ఆమె బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి కూడా తానేమి రేవ్ పార్టీలో పాల్గొనలేదు, నా పరువు పోగొట్టేలా మీడియా నా వెంట పడింది, నేను డ్రగ్స్ తీసుకోలేదు అని వాదించిన హేమను పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారించడం, తర్వాత బెయిల్ పై ఆమె బయటికి రావడమే కాదు, ఈమధ్యన తన బ్లడ్ శాంపిల్స్ నెగెటివ్ వచ్చాయి, తానేమి డ్రగ్స్ తీసుకోలేదని నిర్దారణ అయినట్లుగా చెప్పుకుని మా అధ్యక్షుడు విష్ణు తో మాట్లాడి తనపై ఉన్న బ్యాన్ ను ఎత్తి వేయించుకుంది.
కట్ చేస్తే హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అవడమే కాదు, హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ నిర్దారణ సర్టిఫికెట్ ను బెంగుళూరు పోలీసులు ఛార్జ్ షీట్ లో పొందుపరచడం హాట్ టాపిక్ అయ్యింది. 1086 పేజీలతో సాక్ష్యాలు, పార్టీలో జరిగిన విషయాలతో ఛార్జ్ షీట్ ను పోలీసులు రెడీ చేసారు.
రేవ్ పార్టీలో హేమ పోలీసులకు దొరకడమే కాదు, డ్రగ్స్ తీసుకున్నట్టుగా శాంపిల్స్ లో తేలింది, ఛార్జ్ షీట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్దారణ కూడా అయ్యింది. హేమ డ్రగ్స్ తీసుకున్న సాక్ష్యాలన్నీ పోలీసులు ఛార్జ్ షీట్ లో పొందుపరచడంతో హేమకు బెయిల్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
నిన్నటివరకు తన పరువు కు మీడియా భంగం కలిగించింది, తానే తప్పు చెయ్యలేదు, మీడియా కావాలనే నన్ను టార్గెట్ చేసింది, నేను డ్రగ్స్ తీసుకోలేదు, కావాలంటే నా శాంపిల్స్ పరిక్ష చేసుకోండి అంటూ వాదించిన హేమ ఇప్పుడేం మాట్లాడుతుందో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.