Advertisementt

జగన్ ఒంటరి వాడయ్యాడా? చేసారా?

Thu 12th Sep 2024 10:35 AM
jagan  జగన్ ఒంటరి వాడయ్యాడా? చేసారా?
Jagan Mohan Reddy is seen alone జగన్ ఒంటరి వాడయ్యాడా? చేసారా?
Advertisement
Ads by CJ

అధికారంలో ఉన్నప్పుడు జగన్ చుట్టూ ఈగలు చుట్టుముట్టిన వారందరూ నేడు జగన్ పక్కన కనిపించడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని, రోజా, సజ్జల, పెద్దిరెడ్డి, అంబటి, అనిల్ కుమార్ యాదవ్, బుగ్గన, జోగి రమేష్, పెద్దిరెడ్డి అంతా చుట్టూనే ఉండేవారు. 

కానీ ఈరోజు నందిగం సురేష్ ని జైలులో ములాఖత్ అవడానికి వెళితే జగన్ పక్కన విడదల రజిని తప్ప ఎవరూ కనబడలేదు. అది చూసిన చాలామంది అయ్యో జగన్  అధికారం లేకపోయేసరికి నీ పక్కన నిలబడడానికి కూడా ఎవరూ లేకుండా పోయెనే అంటూ మాట్లాడడం హైలెట్ అయ్యింది. మరి నిజంగా జగన్ ఒంటరివాడయ్యాడా.. లేదంటే ఒంటరి వాణ్ణి చేసారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

అధికారం ఉన్నప్పుడు పొలోమంటూ జగన్ చుట్టూ చేరిన వారు ఈరోజు ఏమైపోయారు. ఒకవేళ జగన్ వారిని దూరం పెట్టాడా, లేదంటే వారే దూరం జరిగారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జగన్ ఒంటరి ప్రయాణం చేస్తున్నట్టే కనిపిస్తుంది. 

Jagan Mohan Reddy is seen alone:

Jagan Mohan Reddy

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ