పోతిన మహేష్.. ఈ పేరు ఏపీ రాజకీయాలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు..! ఇక జనసేన, వైసీపీ శ్రేణులకు ఐతే అస్సలే అక్కర్లేదు..! ఎందుకంటే ఈయన అంత దురదృష్టవంతుడు మరొకరు ఉండరు.. ఉండబోరు అంతే..! గ్లాస్ పార్టీ నుంచి ఫ్యాన్ కిందికి వచ్చిన ఆయన గాలి వస్తున్నా సరే ఉక్కిరి బిక్కిరే అవుతున్నారు..! పైకి చెప్పుకోలేక, కక్కలేక మింగలేక ఏం చేయాలో దిక్కుతోచక అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో కనిపించాలి.. ఏదో ఒక రకంగా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంట్లో పడాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
నాడు.. నేడు..!
జనసేన నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పోతిన కార్యకర్తగా మొదలై ఎమ్మెల్యేగా పోటీ చేసే వరకూ ఎదిగారు. ఐతే.. విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి టికెట్ ఆశించిన మహేష్.. కూటమిలో భాగంగా బీజేపీకి టికెట్ దక్కడం, అందులోనూ బడా పారిశ్రామికవేత్త సుజనా చౌదరికి కావడంతో చేసేదేమీ లేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో పార్టీకి గుడ్ బై చెప్పేసి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి అప్పటి వరకూ జనసేన తరపున కనీసం టీవీ డెబెట్లకు అటెండ్ అయ్యే పరిస్థితి లేదు.. అలాంటి వాతావరణం నుంచి చాలానే మార్పులు తెచ్చారు. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేత పోతిన.. ఆ తర్వాత చాలా మంది తెరపైకి వచ్చారు. పార్టీ కోసం ఇంత చేసిన తనకే ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయేసరికి.. దండం పెట్టేసి వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో మనం అంతా నిత్యం చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు ఏంటి..!?
వైసీపీలోకి వచ్చీ రాకమునుపే నాడు పవన్ కళ్యాణ్ పై ఎలా నోరు పారేసుకున్నారో చూస్తూనే ఉన్నాం కదా. రోజూ ఏదో ఒకలా వైసీపీ అనుకూల మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో గట్టిగానే హడావుడి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే.. పార్టీలో ఇప్పుడు తిప్పికోడితే పేర్ని నాని, వెంకటరెడ్డి కారుమూరు తప్పితే టీవీ డిబెట్లుకు వెళ్లి మాట్లాడే పరిస్థితి లేదు అందుకే.. ఎక్కడ చూసినా మహేష్ ముఖమే కనిపిస్తోంది.. వాయిస్ వినిపిస్తోంది. ఇక ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఉమ్మడి విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ఎక్కడ పర్యటించినా సరే.. జెండా పట్టుకుని జనాల్లో కలిసిపోయి లీడర్ అనేది మరిచిపోయి, కార్యకర్తగా మారిపోతున్నారు. దీంతో ఇదంతా స్టంట్ అని కొందరు అంటుంటే.. పోతిన మహేష్ మాత్రం ఒక కార్యకర్త లాగా జగన్ అన్న కోసం ఉంటున్నాడు.. ఈయన్ను అన్న కొంచం పట్టించుకొని, తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు. అవునా.. నిజమా అంటూ నెటిజన్లు, వైసీపీలోని కొందరు కార్యకర్తలు చెప్పుకుంటున్న మాటలు.
దురదృష్టవంతుడా కాదా..!
అవును పోతినకు టికెట్ దక్కలేదు.. ఉన్నది 21 సీట్లు, 02 ఎంపీ సీట్లు గనుక అందులోనూ కీలక స్థానాలన్నీ టీడీపీ, బీజేపీ తీసుకొని .. మిగిలినవి జనసేన తీసుకోవాల్సిన పరిస్థితి. జరిగింది ఏదో జరిగిపోయింది.. ఇక పార్టీనే అంటిపెట్టుకొని ఉండి ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేది..? ఒక్కసారి ఊహించుకోండి. కచ్చితంగా ఎమ్మెల్సీ లేదా ఏదో ఒక కార్పొరేషన్ ఛైర్మెన్ అయ్యేవారా.. కాదా..? అలాంటిది ఇప్పుడు వైసీపీ జెండాలు పట్టుకుని తిరుగుడు ఏంటి..? ఎవరు చెప్పారు ఇవన్నీ..? ఎందుకు వచ్చిన తిప్పలు ఇవన్నీ..? అని మహేష్, అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటున్న మాటలు. ఇవన్నీ కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర కనీసం సలహాదారు లేదా పార్టీకి చెందిన ఏదో ఇక పెద్ద పదవి అనేది దక్కేది కదా..! అని ఒకింత పవన్, మహేష్ అభిమానులు బాధ పడుతున్నారు. ఎందుకంటే.. గుంటూరు సబ్ జైలు దగ్గరికి వైఎస్ జగన్ రాగా ఆయన కంట్లో పడాలని వైసీపీ జెండా పట్టుకుని మరీ జనాల్లో కలసిపోయి లేని పోని స్టంట్లు చేయాల్సిన అవసరం ఏంటో ఆయనకే తెలియాలి మరి. జనసేనలో ఉండి ఉంటే ఎంతో గౌరవం, తగిన ఉండేది కదా.. ఐనా దేనికైనా అదృష్టం, రాసి పెట్టి ఉండాలి అంటారు కదా..!!