Advertisementt

మెగా ఫ్యాన్స్ కు ఇది తగునా?

Wed 11th Sep 2024 10:28 PM
devara  మెగా ఫ్యాన్స్ కు ఇది తగునా?
Is it suitable for mega fans? మెగా ఫ్యాన్స్ కు ఇది తగునా?
Advertisement
Ads by CJ

మెగా అభిమానులు కొద్దిరోజులుగా వైల్డ్ గా బిహేవ్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ అప్ డేట్ కోసం మొహం వాచిపోయి ఉన్న మెగా ఫ్యాన్స్ ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా విషయంలో చేస్తున్న ట్రోలింగ్ చూస్తే మెగా ఫ్యాన్స్ ఇది మీకు తగునా అని అనకమానరు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఎన్టీఆర్ ని తక్కువ చేసి మాట్లాడిన మెగా ఫ్యాన్స్ కు ఆ తర్వాత ఆచార్య బిగ్ షాకిచ్చింది. 

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్-రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య నిరాశ పరచడంతో మెగా అభిమానులు కొరటాల పై బాగా పగ పెట్టేసుకున్నారు. ఇప్పుడు కొరటాల శివ నుంచి పాన్ ఇండియా ఫిలిం దేవర రాబోతుంది. కనీసం రామ్ చరణ్ ఫ్రెండ్ ఎన్టీఆర్ సినిమా అని కూడా చూడకుండా కొరటాల పై ఉన్న కోపంతో దేవర చిత్రాన్ని మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. దేవర ట్రైలర్ రాగానే ఆచార్య పాద ఘట్టం, దేవర సముద్ర మట్టం అంటూ ఓ పిక్ ని మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 

అంతేకాదు దేవర నుంచి పోస్టర్ వచ్చినా లేదంటే సాంగ్ విడుదలైనా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పోస్టర్ తో కంపేర్ చేస్తూ ఎన్టీఆర్ ఆహార్యాన్ని అవమానిస్తున్నారు. అసలు చరణ్-ఎన్టీఆర్ ఫ్రెండ్స్. కానీ మెగా అభిమానులు ఇప్పుడు ఎన్టీఆర్ ను పనిగట్టుకుని అవమానించడానికి కారణం కొరటాల. 

కొరటాల శివ తమ మెగా హీరోలకు ఆచార్య లాంటి బిగ్గెస్ట్ డిసాస్టర్ ఇవ్వడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కొరటాల నుంచి వస్తున్న దేవర ను వారు టార్గెట్ చేసారు. అది చూసిన నెటిజెన్స్ మెగా ఫ్యాన్స్ ఇది మీకు సమంజసమేనా అని అడుగుతున్నారు.

Is it suitable for mega fans?:

Mega fans trolling on Devara trailer

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ