Advertisementt

మరోమారు వీరసింహారెడ్డి జోడీ రెడీ !

Wed 11th Sep 2024 08:50 PM
balakrishna  మరోమారు వీరసింహారెడ్డి జోడీ రెడీ !
Veera Simha Reddy Combo Repeat మరోమారు వీరసింహారెడ్డి జోడీ రెడీ !
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ తో మూవీ చేసేందుకు చాలామంది దర్శకులు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. మాస్ దర్శకుడు బాలయ్యకి దొరికితే బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం. అందులో ఈమధ్యకాలంలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు చూస్తే మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ కాంబో లు గుర్తుకు వస్తాయి. 

గత ఏడాది వీరసింహారెడ్డి తో గోపీచంద్ మలినేని బాలయ్య తో మాస్ హిట్ కొట్టాడు. వీరసింహారెడ్డి లో బాలయ్య మాస్ లుక్స్ పై నందమూరి అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ అంతా తెగ ఇంప్రెస్స్ అయ్యారు. వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అవడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. 

ఇప్పుడు మరోసారి వీరసింహారెడ్డి కాంబో రిపీట్ కాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరసింహారెడ్డి తర్వాత గోపిచంద్ మలినేని రవితేజ తో సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉంది. కానీ రవితేజని తప్పించి బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ని మైత్రి మేకర్స్ తెరపైకి తీసుకొచ్చారు. బాలయ్య కూడా బాబీ తో NBK109 చేస్తున్నారు. తర్వాత ఆయన అఖండ 2 చెయ్యాల్సి ఉంది. 

మరి ఎప్పుడు గోపీచంద్.. బాలయ్య తో మూవీ చేస్తారో..  వీరసింహారెడ్డి కాంబో ఎప్పటికి రిపీట్ అవ్వుద్దో అని నందమూరి అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  

Veera Simha Reddy Combo Repeat:

Balakrishna teaming with Gopichand Malineni

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ