జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నేతలను ఎంతగా ఇబ్బంది పెట్టారో అచ్చెన్నాయుడు, పట్టాభి ముఖ్యంగా మాజీ సీఎం అని చూడకుండా స్కిల్స్ స్కామ్ లో చంద్రబాబుని 50 రోజులు పైగానే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచిన జగన్ మోహన్ రెడ్డి అప్పుడే రివెంజ్ రాజకీయాలు చేసాడు అని ప్రతి ఒక్కరు చెబుతారు. అసలు ఏపీలో ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలని కంకణం కట్టుకుని టీడీపీ ని వదలుకోని నేతలకు కేసుల రుచి చూపించాడు.
జగన్ టీడీపీ కి ప్రతిపక్ష హోదా అనేది లేకుండా చేయ్యాలని చూస్తే తిరిగి ప్రజలే జగన్ కు ప్రతిపక్ష హోదా లేకుండా ఈ ఎన్నికల్లో ఓడించారు. ఇక చంద్రబాబు - పవన్ కళ్యాణ్ - బీజేపీ తో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన కూడా జగన్ దారిలోనే నడుస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన ఏ ఒక్కరిని వదలబోమని శపధం చేసి మరీ ఆయన పని మొదలు పెట్టారు.
ఇప్పటికే టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో నందిగం సురేష్ ని అరెస్ట్ చేసారు పోలీసులు, ఇంకా అవినాష్, వల్లభనేని వంశీల కోసం పోలీసులు వెతుకుతున్నారు. వారు ముందస్తు బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు ఈవీఎం ల ధ్వంశం కేసులో పిన్నెల్లి అరెస్ట్ ఇవన్నీ చూసి జగన్ మళ్ళి తన రివెంజ్ రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేసాడు.
మీ 5 ఏళ్ళ తర్వాత నా 5 ఏళ్ళు వస్తాయి, అప్పుడు కూటమి నాయకులందరినీ తెచ్చి ఇదే జైలు లో వేస్తాను అంటూ ఈరోజు బుధవారం నందిగం సురేష్ ని జైలులో మూలాఖాత్ అవ్వడానికి వెళ్లిన సందర్భంగా ఓపెన్ గా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నా మీద అభిమానంతో నన్ను తిట్టిన వారిపై కుర్రాళ్ళు ఏదో నాలుగు రాళ్లు వేశారంటూ లైట్ గా తీసిపారేసిన జగన్ ను నెటిజెన్స్ ఆడుకుంటున్నారు. నువ్వే మొదలెట్టిన రివెంజ్ రాజకీయాల పై మళ్ళీ నువ్వే స్టేట్మెంట్స్ ఇస్తావా జగన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.