కోలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడిపోయి విడాకులు తీసుకుంటున్నాము, ఇది మా ప్రవేట్ విషయం, మమ్మల్ని రకరకాల ప్రశ్నలతో వేధించి ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఆఫీషియల్ గా విడాకుల విషయాన్ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయ్యో 18 ఏళ్ళ వివాహ బంధాన్ని జయం రవి-ఆర్తి లు ఎలా వదులుకుంటున్నారు, ఈ విషయంలో పిల్లలు సఫర్ అవుతారని ఆయన అభిమానులు బాధపడిపోతున్నారు.
కానీ ఇప్పుడు జయం రవి విడాకుల విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అది జయం రవి భార్య ఆర్తి తనకు తెలియకుండా తన భర్త ఈ విడాకుల మేటర్ ఎలా అనౌన్స్ చేస్తాడు, తనకి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు, నేను నా భర్త తో ఎప్పటి నుంచో మాట్లాడానికి ట్రై చేస్తున్నా అందుకు నాకు సమయం ఇవ్వడం లేదు అంటూ సెన్సేషనల్ పోస్ట్ చేసింది.
ఈ విషయంలో రోడ్డెక్కడం నాకు నచ్చలేదు, సమస్యను పరిష్కరించే దిశగా నేను అడుగులు వేస్తున్నాను, నాకు నా పిల్లలు ముఖ్యం, తనకు, పిల్లలకు చెప్పకుండా ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధ కలిగించిందని ఆర్తి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.. మరి ఈ విషయం జయం రవి ఎలా స్పందిస్తారో చూడాలి.