ధమాకా హిట్ తో వరస అవకాశాలు దోచేసిన మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల కి మళ్ళీ ధమాకా లాంటి ఒక్క హిట్ కూడా తగల్లేదు. వరస ఆఫర్స్, యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేస్కుంటున్నా అనే ఎగ్జైట్మెంట్ తప్ప శ్రీలీల తన పాత్ర తీరు తెన్నులను అంచనాలు వెయ్యడంలో అనుభవం సరిపోలేదు. దానితో వరసగా నిరాశ పరిచే సినిమాలు ఆమెను ఇబ్బంది పెట్టాయి.
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అవకాశాలు శ్రీలీల చుట్టూ తిరుగుతున్నా ఆమె మాత్రం సోషల్ మీడియాలో క్రేజీ ఫోటో షూట్స్ తో దర్శకనిర్మాతలకు వల వేస్తుంది. తరచూ మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. యూత్ ని టార్గెట్ చేస్తూ అందమైన భంగిమలలో ఫొటో షూట్స్ చేయించుకుంటూ సందడి చేస్తుంది.
తాజాగా శ్రీలీల వదిలిన ఫొటోస్ చూస్తే నిజంగా మైమరిచిపోవాలంతే. చమ్కీ డ్రెస్ లో శ్రీలీల కొత్త లుక్ మతిపోగొట్టేసింది. మత్తెక్కించే చూపులతో శ్రీలీల ఇచ్చిన ఫోజులకు యూత్ మొత్తం చొంగ కార్చుకోవాల్సిందే. మీరు శ్రీలీల కొత్త పిక్ పై ఓ లుక్కెయ్యండి.