డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ నుంచి సినిమా షూటింగ్స్ కు హాజరవుతారని ఆయనే మాటిచ్చారు. అంటే ఇంకో నెలలో పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి వచ్చేస్తారని ఆయనతో పని చేసే దర్శకనిర్మాతలు కాచుకుని కూర్చున్నారు. అసలు పవన్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని వారు ఆయన కోసం విజయవాడలోనే సెట్ వేసి మిగతా షూటింగ్స్ కంప్లీట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు.
పవన్ మూడు నెలల సమయం ఇవ్వండి.. ఏపీలో పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్స్ కి వస్తాను అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏపీలో సానుకూల పరిస్థితి లేదు. అక్కడ వర్షాలు, వరదలతో అంతా అస్తవ్యస్తం అయ్యింది. ప్రస్తుతం ముంపు ప్రాంత ప్రజలను ఆదుకునే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇలాంటి స్థితిలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ కు వస్తే మాములుగా ఉండదు.
ఏపీని దారుణమైన పరిస్థితిలో వదిలేసి పవన్ షూటింగ్స్ చేస్తే పవన్ ను ఏపీ ప్రజలు క్షమించరు. సో పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల వరకు మళ్ళీ సినిమా సెట్స్ మీదకి రావడం అనేది జరిగేలా లేదు. అది ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది వ్యవహారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడ వరదలను పట్టించుకోకుండా పిఠాపురం, కాకినాడ ప్రజల కోసం పడవ ఎక్కడమనేది ట్రోలింగ్ కి దారితీసింది.